"యుజ్వేంద్ర చాహల్"ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ప్రతి సీజన్ లో తన అత్యున్నత ఆట తీరుని కనబరిచే ఈ మణి కట్టు స్పిన్నర్ ఈ సీజన్లో కూడా అదరగొడుతున్నాడు.ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ జరిగిన సంగత్ తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్ లో సన్ రైజర్స్ చివరి బంతికి విజయం సాధించింది. ఒక దశలో రాజస్థాన్ విజయం ఖాయమనుకుంటున్న దశలో గ్లెన్ ఫిలిప్స్(6,6,6,4) అసాధారణ పోరాటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి బంతికి 5 పరుగులు కావాల్సిన దశలో అబ్దుల్ సమద్ ఔటవ్వడంతో రాజస్థాన్ సంబరాల్లోకి వెళ్ళిపోయింది. కానీ అది నో బాల్ కావడం.. చివరి బంతిని సమద్ సిక్సర్ గా మలచడం అంత ఒక అద్భుతంలా జరిగిపోయింది. అయితే రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ ఓడిపోయినా చాహల్ ఆకట్టుకునే ప్రదర్శన చేసాడు. 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
“యుజ్వేంద్ర చాహల్“ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ప్రతి సీజన్ లో తన అత్యున్నత ఆట తీరుని కనబరిచే ఈ మణి కట్టు స్పిన్నర్ ఈ సీజన్లో కూడా అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు(183) తీసుకున్న బౌలర్ల లిస్టులో విండీస్ అల్ రౌండర్ బ్రావోతో కలిసి అగ్ర స్థానంలో నిలిచాడు. సన్ రైజర్స్ కెప్టెన్ మార్కరంని ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కి పంపి ఈ ఘనత సాధించాడు. బ్రావో 161 మ్యాచులో ఈ ఫీట్ అందుకోగా.. చాహల్ మాత్రం 141 మ్యాచులు మాత్రమే అవసరమయ్యాయి. ఇక ఈ లిస్టులో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ స్పిన్నర్ అయినటువంటి పీయూష్ చావ్లా (175) మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం బ్రావో ఐపీఎల్ కి గుడ్ బై చెప్పడంతో ఈ రికార్డ్ చాహల్ పేరు మీద ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. మరి చాహల్ సాధించిన ఈ రికార్డ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.