''ఈ సాలా కప్ నమ్దే".. ఐపీఎల్ కు ఎంత క్రేజ్ ఉందో.. ఈ స్లోగన్ కు కూడా అంతే క్రేజ్ ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పేటెంట్ హక్కులా ఈ స్లోగన్ ఉంది. ఇక ఈ స్లోగన్ పై తాజాగా స్పందించాడు కింగ్ విరాట్ కోహ్లీ.
10 నిమిషాల్లో క్లోజ్ చేసే ఏ పబ్ ముందుకెళ్లినా అక్కడో స్లోగన్ వినిపిస్తుంది. ఇది వీరసింహా రెడ్డి సినిమాలో బాలయ్య చెప్పే డైలాగ్. ఇక ఐపీఎల్ ప్రారంభం అవ్వబోతోంది అన్న దగ్గర నుంచే క్రికెట్ వర్గాల్లో మీకో స్లోగన్ వినిపిస్తుంది. ఆ స్లోగన్ ఏంటో మీకు ఈపాటికే గుర్తుకు వచ్చింది అనుకుంటా. ”ఈ సాలా కప్ నమ్దే”.. ఐపీఎల్ కు ఎంత క్రేజ్ ఉందో.. ఈ స్లోగన్ కు కూడా అంతే క్రేజ్ ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పేటెంట్ హక్కులా ఈ స్లోగన్ ఉంది. ఈ స్లోగన్ కారణంగానే ఆర్సీబీ ని ట్రోల్స్, మీమ్స్ చేస్తూ.. కామెంట్స్ చేస్తుంటారు కొందరు. ఇక ఈ స్లోగన్ పై తాజాగా స్పందించాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఐపీఎల్ ప్రారంభం కాగానే ఈ స్లోగన్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే ఈ సాలా కప్ నమ్దే అన్న స్లోగన్ తనకు నచ్చదు అని విరాట్ చెప్పుకొచ్చాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్.. ఐపీఎల్ లో ఫుల్ క్రేజ్ ఉన్న టీమ్. గత 15 సంవత్సరాలుగా ఐపీఎల్ కప్ కోసం నిరీక్షిస్తూనే ఉంది. వరల్డ్ క్లాస్ బ్యాటర్ విరాట్, ఏబీడీ, గేల్ లాంటి హిట్టర్లు ఉన్నా గానీ ఇప్పటి వరకు ఐపీఎల్ కప్ సాధించలేదు ఆర్సీబీ. ఇక ప్రస్తుతం జట్టులో డు ప్లెసిస్, విరాట్, బ్రేస్ వెల్, మాక్స్ వెల్, దినేశ్ కార్తిక్, సిరాజ్, హర్షల్ పటేల్, టోప్లే లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. దాంతో ఈసారి అయిన ఆర్సీబీ కప్ కొడుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆర్సీబీ జట్టుకు ఓ స్లోగన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సాలా కప్ నమ్దే.. ఈ స్లోగన్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక తాజాగా ఈ స్లోగన్ పై తీవ్ర అసంతృప్తి చెందుతున్నాడు విరాట్ కోహ్లీ. తనకసలు ఈ స్లోగన్ నచ్చదు అంటూ కాస్త ఘాటుగా చెప్పాడు. ఈ స్లోగన్ కారణంగానే ఆర్సీబీ జట్టు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఆర్సీబీ తన తొలిమ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసి ఐపీఎల్ 2023 సీజన్ ను ఘనంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ తన విశ్వ రూపాన్ని చూపాడు. 5 సిక్స్ లు, 6 ఫోర్లతో 82 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మరి ఈసాలా కప్ నమ్దే అన్న స్లోగన్ నచ్చలేదన్న విరాట్ కోహ్లీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli said, “people tell me King out of love, but I personally don’t prefer it. Like ‘Ee Sala Cup Namdhe’, don’t say ‘King’ (smiles)”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2023