ఐపీఎల్ మ్యాచులు ఉత్కంఠగా సాగుతున్నాయి. అంతా బాగానే ఉన్నా కూడా.. బౌలర్లు మాత్రం విపరీతంగా వైడ్లు వేస్తున్నారు. ఇటీవల సిరాజ్ ఒకే ఓవర్లో 5 వైడ్లు వేయడం చర్చనీయాంశం అయింది. వైడ్స్ రూపంలోనే ఎక్కువ పరుగులు వెళ్తున్నాయి. తాజాగా బౌలర్ల తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఒక కొత్త రూల్ ని ప్రతిపాదించారు.
ఐపీఎల్లో బ్యాటర్లతో పోల్చుకుంటే బౌలర్ల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలర్ పరుగులు ఆపడం అనేది సవాలుతో కూడుకున్నది. చివరి ఓవర్లలో.. అలాగే పవర్ ప్లేలో బంతి ఎలా వేసినా, బౌలర్ ఎవరైనా బ్యాటర్ లక్ష్యం బౌండరీ దాటించడమే. ఈ క్రమంలో బౌలర్లు ఆఫ్ స్టంప్ కి దూరంగా బంతులని విసురుతూ ఉంటారు. ఇవి ఒక్కోసారి ఫెయిల్ అవుతూ వైడ్ రూపంలో ప్రత్యర్థికి అదనంగా పరుగులు వెళ్తాయి. ఒక్కోసారి బౌలర్లు బాగా ఒత్తిడికిలోనై వరుస పెట్టి వైడ్ బాల్స్ వేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇవే జట్టు పరాజయానికి కారణమవుతాయి. ఇలాంటి నేపథ్యంలో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ బౌలర్లకు కాస్త కఠినంగా ఉండేలా ఐపీయల్లో ఒక కొత్త రూల్ ప్రతిపాదించాడు.
ఐపీఎల్ లాంటి టోర్నీలో బౌలర్లు రాణించాలంటే అది కత్తి మీద సామే. ఎంత బాగా బౌలింగ్ చేసినా ఒక్క ఓవర్ లో భారీగా పరుగులు సమర్పించుకొని మ్యాచ్ చేజారిపోయిన సందర్భాలు మనం చాలా చూశాం. దీనికి తోడు ఫ్రీ హిట్ బౌలర్ల పాలిట శాపంగా మారింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు గవాస్కర్ చెప్పిన కొత్త రూల్ బౌలర్లను వణికించేలా ఉంది. వరుసగా రెండు వైడ్ లు వేస్తే ఆ తర్వాత బంతిని ఫ్రీ హిట్ గా ప్రకటిచాలి అని చెప్పుకొచ్చాడు. దిగ్గజ క్రికెటర్ ఈ ప్రతిపాదన బ్యాటర్లకు కాస్త అనుకూలంగా ఉన్నా.. ఈ రూల్ తీసుకొని వస్తే క్రమశిక్షణగా బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది.
అయితే గవాస్కర్ వ్యాఖ్యలపై విండీస్ మాజీ ఆటగాడు ఇయాన్ బిషప్ స్పందించాడు. గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివి అంటూ కొట్టిపారేశాడు. సునీల్ గవాస్కర్ ఈ రూల్ ప్రతిపాదించడం వెనుక ప్రస్తుత ఐపీఎల్లో బౌలర్లు భారీగా వైడ్ బాల్స్ వేయడమే అని తెలుస్తోంది. ఇటీవలే చెన్నై బౌలర్లు ఎక్కువగా వైడ్ బాల్స్ వేయడంతో ధోని తన అసహనాన్ని తెలియజేశాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో చెన్నై గెలిచినా బౌలర్లు మాత్రం పదే పదే వైడ్ బాల్స్ వేస్తూ ధోని సహనాన్ని పరీక్షించారు. దీంతో మ్యాచ్ అనంతరం ధోని దీనిపై స్పందించాడు. ఇలాగే వైడ్ల రూపంలో ఎక్స్ ట్రాలు ఇచ్చే పనైతే కొత్త కెప్టెన్ ని వెతుక్కోవాలంటూ వ్యాఖ్యానించాడు.
నిన్న మ్యాచ్ లో కూడా షమీ మొదటి ఓవర్లో వైడ్ రూపంలో చాలా పరుగులు సమర్పించుకున్నాడు. ఆర్సీబీ- ముంబై మ్యాచ్ లో ఒకే ఓవర్లో సిరాజ్ 5 వైడ్లు బౌల్ చేశాడు. అందులో 4 కంటిన్యూ వైడ్స్ ఉన్నాయి. ఈ సీజన్లో బౌలర్లు ఎక్కువగా వైడ్ బాల్స్ వేయడం అటు ప్రేక్షకులను సైతం అసహనానిక గురి చేస్తోంది. ఇలా వైడ్ బాల్స్ విసరడం వలన ప్రత్యర్థి జట్టుకి అదనపు పరుగులతో పాటు సమయం కూడా వృథా అవుతుంది. మరి సునీల్ గవాస్కర్ చెప్పినట్టు వైడ్ బాల్ విషయంలో ఫ్రీ హిట్ తీసుకొస్తారో లేదో చూడాలి. వైడ్ బాల్స్ కి ఫ్రీ హిట్ రూల్ వస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.
Mohammed Siraj bowled the longest over in the IPL history.
He took 11 balls to complete his over, which included 5 wides. #IPL2023 | #IPL | #MohammedSiraj | #RCBvMI pic.twitter.com/a8XVxgovZX
— Cricket.com (@weRcricket) April 3, 2023