స్టీవ్ స్మిత్ ని ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. దాంతో కామెంటేటర్ గా అవతరం ఎత్తి ఈసారి ఐపీఎల్ లో సందడి చేయనున్నాడు. ఈక్రమంలోనే ఐపీఎల్ లో ఏ ఆటగాడు అయిన గాయాల పాలైతే.. అతడి స్థానంలో ఆడతారా అని స్మిత్ ను ప్రశ్నించగా.. నేను దానికి అనర్హుడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
స్టీవ్ స్మిత్.. సమకాలీన ప్రపంచ క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతమైన ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక కెప్టెన్ గా సైతం ఆసీస్ ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు. అయితే ఇంతటి ఘనత సాధించిన స్మిత్ ని ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. దాంతో కామెంటేటర్ గా అవతరం ఎత్తి ఈసారి ఐపీఎల్ లో సందడి చేయనున్నాడు. ఈక్రమంలోనే ఐపీఎల్ లో ఏ ఆటగాడు అయిన గాయాల పాలైతే.. అతడి స్థానంలో ఆడతారా అని స్మిత్ ను ప్రశ్నించగా.. నేను దానికి అనర్హుడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దానికి అతడు చెప్పిన కారణం ఏంటంటే?
2023 ఐపీఎల్ క్రికెట్ జాతర మెుదలైంది. అయితే ఈ సీజన్ కు గాయాల బెడద ఎక్కువైంది. దాంతో కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్లు సైతం బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తోంది. ఇక వారి ప్లేస్ ను రీ ప్లేస్ చేయడానికి మరో ప్లేయర్ ను తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇక్కడే ఓ తిరకాసు ఉంది. ఆ నిబంధన కారణంగానే స్టీవ్ స్మిత్ ఏ ఆటగాడి ప్లేస్ ను రీ ప్లేస్ చేసే అవకాశం లేకుండా పోయింది. అందుకే నేను ఈ ఐపీఎల్ ఆడటానికి అనర్హుడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ ఒక్క నిబంధనే స్మిత్ ను ఈ ఐపీఎల్ ఆడకుండా అడ్డుకుంటోంది. ఇంతకీ ఆ నిబంధన ఏంటంటే?
ఐపీఎల్ లో పాల్గొనాలి అంటే సదరు ఆటగాడు ముందు వేలంలో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత నిర్వహించిన వేలంలో ఏదో ఒక ఫ్రాఛైజీ ఆ ఆటగాడిని కొనుగోలు చేస్తుంది. ఇక అమ్ముడు పోకుండా ఉన్న రిజిస్టర్డ్ ఆటగాళ్లను జట్టులో ఉన్న ఏ ఆటగాడు అయిన గాయం కారణంగా టోర్నీకి దూరం అయితే అతడి ప్లేస్ ఇలాంటి ఆటగాళ్లతో భర్తీ చేస్తారు. ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్ ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ కాలేదు.. దాంతో అతడు ఏ ఆటగాడి ప్లేస్ ను భర్తీ చేసే అవకాశం లేదు. ఇదే విషయానికి తాజాగా వెల్లడించాడు స్టీవ్ స్మిత్. దాంతో చేసేది ఏమీ లేక కామెంటేటర్ గా కొత్త అవతారం ఎత్తాడు స్మిత్.
Steven Smith said, “I didn’t register for the auction, so I’m not eligible to be anyone’s replacement in IPL 2023”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2023