Bhuvneshwar Kumar: సీజన్ ఆరంభానికి ముందు చాలా పటిష్టంగా కనిపించిన ఎస్‌ఆర్‌హెచ్ తొలి మ్యాచ్‌లోనే దారుణంగా ఓడింది. అయితే ఈ ఓటమికి తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్ కుమారే కారణమంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఐపీఎల్ 2023 సీజన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమితో ప్రారంభించింది. గెలుపు సంగతి అలా ఉంచితే.. కనీసం ఏ దశలో కూడా పోరాట పటిమ చూపించకుండా చేతులెత్తేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా.. అన్ని విభాగాల్లో విఫలమవుతూ సొంత గ్రౌండ్ లో అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో ఓడిపోయి దారుణ విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులే సన్ రైజర్స్ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ భువనేశ్వర్‌పై ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ కుమార్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం అని తెలుస్తుంది.
హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేరిన రాయల్స్ జట్టుకి ఓపెనర్లు మెరుపు ఆరంభాని ఇచ్చారు. ముఖ్యంగా బట్లర్(54) ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా.. జైస్వాల్ (54), కెప్టెన్ సంజు శాంసన్(55) కూడా అర్ధ సెంచరీలతో మెరిశారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ పతనం తొలి ఓవర్ నుంచే ప్రారంభమైంది. బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో అభిషేక్ శర్మ, త్రిపాఠి డకౌట్ గా వెనుదిరిగారు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఓ వైపు బంతులు వృథా చేస్తూనే.. మరో వైపు పెవిలియన్ కి క్యూ కట్టారు. దీంతో హైదారాబాద్ జట్టు కేవలం 131 పరుగులే చేయగలిగింది.
ఇంత భారీ ఓటమి అనంతరం కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ..”నిజానికి ఇక్కడ పిచ్ లు మాకు అనుకూలంగా తయారు చేసుకోవచ్చు. కానీ మేము అలా చేయలేదు. ఈ విషయంలో మాకు ఎలాంటి బాధ లేదు. ఈ పరాజయాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి.చివరి ఆరు ఓవర్లలో మా బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. కానీ పరిస్థితి అప్పటికే చేజారిపోయింది. ఇక రాజస్థాన్ బ్యాటర్లు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. చాహల్, అశ్విన్ చాలా బాగా రాణించారు. సౌతాఫ్రికా బ్యాటర్లు జట్టులో చేరితే మా బ్యాటింగ్ పటిష్టమవుతుంది”.అని చెప్పుకొచ్చాడు. భువీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాను కి ఏ మాత్రం నచ్చడం లేదు. “బ్యాట్టింగ్ కి అనుకూలించే పిచ్ మీద నువ్వు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నావు. జట్టులో ముగ్గురు పేసర్లు ఉన్నప్పుడు వారి సేవలను సరిగ్గా ఉపయోగించకుండా నువ్వు బౌలింగ్ చేసి 3 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నావు. కీలక దశలో ఒత్తిడిని నువ్వు జయించలేకపోయావు. నువ్వు కెప్టెన్ గా అసలు పనికి రావు’ అని ఫ్యాన్స్ ఈ ఫాస్ట్ బౌలర్ మీద అభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bhuvneshwar Kumar has won the toss and Sunrisers Hyderabad will bowl first against Rajasthan Royals 💪#SRHvRR #IPL2023 pic.twitter.com/JQn2ynk5mX
— Sportskeeda (@Sportskeeda) April 2, 2023