Sanju Samson: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిజానికి రాజస్థాన్ గెలవాల్సింది. చివరి వరకు వచ్చి, 5 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమికి కెప్టెన్‌గా సంజు శాంసన్ తీసుకున్న కఠిన నిర్ణయమే కారణమంటూ రాజస్థాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
కెప్టెన్ తుది జట్టులో మార్పులు చేయడం అనేది సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే అతని స్థానంలో వచ్చే ప్లేయర్ ప్రభావం చూపించకపోతే దానికి కెప్టెనే పూర్తి బాధ్యత వహించాలి. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తే అంత కన్నా సాహసం మరొకటి ఉండదేమో. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు ఏ మాత్రం బెడిసి కొట్టినా అభిమానుల నుండి దిగ్గజాల వరకు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇదే తప్పు చేసాడు అని చాలా మంది భావించారు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై శాంసన్ క్లారిటీ ఇచ్చాడు.
ఐపీఎల్లో నిన్న రాజస్థాన్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చివరి వరకు పోరాడినా ఈ మ్యాచ్ లో సంజు అండ్ కో కి పరాజయం తప్పలేదు. అయితే ఈ పరాజయానికి ప్రధాన కారణం.. పటిష్టమైన రాయల్స్ జట్టు ఓపెనర్ గా బట్లర్ స్థానంలో బౌలింగ్ అల్ రౌండర్ అశ్విన్ని పంపడమే అంటున్నారు క్రికెట్ అభిమానులు. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్ జైస్వాల్ తో పాటు అనూహ్యంగా అశ్విన్ ఓపెనింగ్ కి వచ్చాడు. అయితే రాయల్స్ జట్టు ఇలా ఎందుకు చేసిందో అప్పటివరకు ఎవరికీ అర్థం కాలేదు. సన్ రైజర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో బట్లర్, జైస్వాల్ విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి ఓపెనింగ్ జోడీని ఎందుకు మార్చాల్సి వచ్చిందో కెప్టెన్ శాంసన్ చెప్పుకొచ్చాడు “బట్లర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చేతివేలికి కాస్త గాయం అయింది. అందుకే ఓపెనర్ గా అశ్విని పంపించాం. దేవదత్త్ పడిక్కల్ ఓపెనర్ అయినా.. అతని సేవలను మేము మిడిల్ ఆర్డర్ లో వాడుకోవాలనుకున్నాం. పడిక్కల్ స్పిన్ బాగా ఆడడమే దీనికి ప్రధాన కారణం. కానీ మా ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది”.
ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు అదిరిపోయి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో పంజాబ్ 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టుకి టాప్ ఆర్డర్ లో సంజు శాంసన్ కాస్త పర్వాలేదనిపించినా మిగిలిన వారు విఫలమయ్యారు. ఇక చివర్లో హెట్ మేయర్, ధృవ్ పోరాడిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ధావన్ సేన 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి బట్లర్ ని ఓపెనింగ్ కి పంపకపోవడానికి సంజు శాంసన్ ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Here’s how captains Sanju Samson, Shikhar Dhawan, and player of the match Nathan Ellis & Sam Curran reacted to Punjab Kings’ win.
📸: IPL/BCCI#CricTracker #RRvPBKS pic.twitter.com/Jh4UV1lERh
— CricTracker (@Cricketracker) April 5, 2023