'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' అన్నట్లు తయ్యారు అయ్యింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరిస్థితి. ఇక ఈసారి కూడా ఆర్సీబీకి కప్ రాదా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. దానికి 5 ప్రధాన కారణాలను వెల్లడిస్తున్నారు క్రీడా విశ్లేషకులు. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు తయ్యారు అయ్యింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరిస్థితి. గత 15 సీజన్లలో ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా కొట్టలేకపోయింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి విధ్వంసకర వీరులు ఉన్న జట్టుగా పేరుగాంచిన ఆర్సీబి.. అందుకు తగ్గట్లుగా రాణించలేకపోతోంది. కర్ణుడి చావుకు లక్షకారణాలు అన్నట్లు.. ఆర్సీబి జట్టు ఐపీఎల్ గెలవలేక పోవడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. ఇక ఈసారి కూడా ఆర్సీబీకి కప్ రాదా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. దానికి 5 ప్రధాన కారణాలను వెల్లడిస్తున్నారు క్రీడా విశ్లేషకులు. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ గా గొప్ప పేరుంది. అయితే ఆ పేరుకు తగ్గట్లుగా ఆడటం లేదు ఆర్సీబీ జట్టు. గత 15 సీజన్లు గా ఐపీఎల్ టైటిల్ కోసం ఆర్సీబీ టీమ్ నిరీక్షిస్తూనే ఉంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి జట్టులో మహామహులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ ను కూడా కైవసం చేసుకోలేదు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్, డుప్లెసిస్, మాక్స్ వెల్ లాంటి ఆటగాళ్లు ఆర్సీబీకి టైటిల్ లను అందించడంలో విఫలం అవుతూనే ఉన్నారు. ఇక 16వ సీజన్ లో కూడా ఆర్సీబీకి టైటిల్ రాదా? అన్న అనుమానాలు ఎక్కువైయ్యాయి. దానికి 5 కారణాలను క్రీడా పండితులు చెప్పుకొస్తున్నారు. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెట్ అంటే సమష్టి ఆట. ఏ ఒక్కరో ఆడితే గెలిచే అవకాశం ఉండదు. ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఇక ఆర్సీబీ జట్టు విషయానికి వస్తే.. ఆడితే ఓపెనర్లు, లేదంటే లేదు. అన్నట్లుగా తయ్యారు అయ్యింది జట్టు పరిస్థితి. ఓపెనర్లుగా డుప్లెసిస్-విరాట్ సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ ఎన్ని మ్యాచ్ లు అని వీరు ఆడగరు? మాక్స్ వెల్ లక్నో మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చినప్పటికీ అతడు ఈ ఫామ్ ను ఎంతవరకు కొనసాగిస్తాడన్నది అనుమానమే. ఇక టాపార్డర్ ఎప్పుడైనా కుప్పకూలితే.. ఆదుకోవాల్సి మిడిలార్డర్ చేతులెత్తేస్తుండటం.. ఆర్సీబీకి ప్రధాన సమస్యగా మారింది. మిడిలార్డర్ లో ఉన్న షహబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, డేవిడ్ విల్లీ లాంటి బ్యాటర్లు అంచనాలకు తగ్గట్లుగా రాణించడం లేదు.
ఏ జట్టుకైన ప్రధాన బలం నిలకడగా ఆడటం. అది ఆర్సీబీ జట్టుకు లోపించింది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇదే తంతును కొనసాగిస్తోంది ఈ జట్టు. ఓ మ్యాచ్ గెలవడం, ఇంకో మ్యాచ్ ఓడిపోవడం.. ఇది సంప్రదాయంగా మారింది బెంగళూరు జట్టుకు. జట్టు విజయాలలో నిలకడ అనేది కీలక పాత్ర వహిస్తుంది. జట్టు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టినప్పుడే ఆ టీమ్ కు ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. బ్యాటర్లును, బౌలర్లను సమర్ధవంతంగా వాడుకునే జట్లే ఐపీఎల్ లో రాణిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నిలకడలేమి సమస్యను ఆర్సీబీ అధిగమించినప్పుడే ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడుతుంది.
టీ20 క్రికెట్ లో బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే.. విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే.. పార్నెల్, డేవిడ్ విల్లీ, సిరాజ్, హెజల్ వుడ్, అహ్మద్, హసరంగా లతో బలంగానే కనిపిస్తున్నప్పటికీ.. బౌలింగ్ ఎటాక్ వీక్ గా ఉంది. హసరంగా మూడు మ్యాచ్ ల తర్వార అందుబాటులోకి రానున్నాడు. దాంతో ఆర్సీబీ బౌలింగ్ దళం స్ట్రాంగ్ గా మారుతుంది. అయితే మిగతా బౌలర్లు అయిన హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. పార్నెల్, విల్లీ సైతం ఎక్కువగా రన్స్ ఇస్తూ.. జట్టుకు భారంగా మారుతున్నారు. ఇక వీరి బౌలింగ్ ఎంత వీక్ గా ఉందో లక్నో తో జరిగిన మ్యాచ్ చూస్తే తెలిసిపోతుంది. ఈ మ్యాచ్ లో కర్ణ శర్మ కేవలం 3 ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు. బౌలింగ్ సమస్యను అధిగమిస్తేనే ఆర్సీబీ కల నెరవేరుతుంది.
జట్టులో టాపార్డర్ విఫలం అయితే.. ఆదుకోవాల్సిన బాధ్యత మిడిలార్డర్ దే. ఇక మిడిలార్డర్ ఎంత బలంగా ఉంటే ఆ జట్టుకు గెలిచే అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి. ఇక ఆర్సీబీ మిడిలార్డర్ విషయానికి వస్తే.. దినేశ్ కార్తీక్, షహబాజ్ అహ్మద్, విల్లీ, పార్నెల్, అనుజ్ రావత్ లతో చూస్తుంటూనే వీక్ గా కనిపిస్తుంది. జట్టుకు మిడిలార్డర్ వెన్నముక లెక్క. అలాంటి వెన్నముక ఆర్సీబీకి వీక్ గా మారింది. దాంతో ఈ జట్టు మెుత్తం టాపార్డర్ పైనే ఆధారపడుతోంది. మిడిలార్డర్ సమస్యను అధిగమించకపోతే.. రాబోయే మ్యాచ్ ల్లో బెంగళూరు జట్టు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మెుదటగా వినిపించే పేరు ఈసారి ఆర్సీబీ కప్ కొడుతుందా? అని. ఎందుకంటే ఆర్సీబీకి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. ఐపీఎల్ సీజన్ ఎప్పుడు ప్రారంభం అయినా గానీ ఆర్సీబీపై భారీగా అంచనాలు ఉంటాయి. దాంతో ఆ అంచనాలను అందుకునే క్రమంలో బోల్తా పడుతూ ఉంటుంది బెంగళూరు టీమ్. టీమ్ పై భారీ అంచనాలు ఉండటంతో.. ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ తీవ్రత జట్టుపై పడుతుంది. ఇక బెస్ట్ ఫినిషర్ గా పేరుగాంచిన డీకే.. ఈ ఐపీఎల్ లో దారునంగా విఫలం అవుతూ.. జట్టుకు భారంగా మారుతున్నాడు. అతడిపై కూడా తీవ్రమైన ఒత్తిడి ఉండటంతో.. దానిని అధిగమించడంలో విఫలం అవుతూ వస్తున్నాడు. ఇక ఈ ఐదు కారణాలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అధిగమిస్తే.. కచ్చితంగా కప్ కొడుతుంది అంటున్నారు క్రీడా పండితులు. మరి ఈసారైనా ఆర్సీబీ ఐపీఎల్ కప్ ముద్దాడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.