ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆశలు కాపాడుకున్న ఆర్సీబీ.. తాము ఆడబోయే ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు ముందు ఒక విషయం ఆర్సీబీని బాగా భయపెడుతోంది.
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు ఇంకా ఎక్కువ సయయం లేదు. దాదాపు అన్ని జట్లు తలో 13 మ్యాచ్‌లు ఆడేశాయి. కానీ ఒక్క గుజరాత్ టైటాన్స్ తప్ప ఏ టీమ్ కూడా ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖాయం చేసుకోలేదు. ప్లేఆఫ్స్‌లో మిగిలిన మూడు స్పాట్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిందని అనుకున్న ఆర్సీబీ.. రాజస్థాన్ రాయల్స్‌పై భారీ విజయంతో తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ ఆ టీమ్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలుపు బెంగళూరుకు తప్పనిసరి అనే చెప్పాలి. ఈ మ్యాచ్‌తో పాటు లాస్ట్ గేమ్‌లోనూ గెలిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్ వెళ్లే ఛాన్సులు ఉంటాయి. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు 36 శాతం మేర ఉన్నాయి. దీన్ని పెంచుకోవాలంటే ఆ జట్టు తమ ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి.
సన్‌రైజర్స్‌తో గురువారం ఆడబోయే మ్యాచ్‌పై ఫుల్‌గా ఫోకస్ చేస్తోంది డుప్లెసిస్ సేన. అయితే ఆ టీమ్‌ను ఒక విషయం మాత్రం బాగా భయపెడుతోంది. అదే ఎస్ఆర్హెచ్పై తమ ట్రాక్ రికార్డు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. వాటిలో రెండింట్లో నెగ్గి, మిగిలిన 8 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఉప్పల్‌లో ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో.. ఆర్సీబీ ఒకే దాంట్లో విజయం సాధించింది, మిగిలిన నాలుగింట్లో ఓడిపోయింది. అదే సమయంలో ఎస్ఆర్హెచ్ తమ హోమ్ గ్రౌండ్లో ఇప్పటిదాకా ఆడిన 50 మ్యాచుల్లో 31 విజయాలు, 29 ఓటములతో ఉంది. ఉప్పల్‌లో ఆడితే ఓటమే అన్నట్లుగా ఆర్సీబీ ట్రాక్ రికార్డు ఉంది. అదే సమయంలో ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన ఎస్ఆర్హెచ్కు కోల్పోయేదేం లేదు కాబట్టి ఆ టీమ్ చెలరేగి ఆడొచ్చు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలా గెలవాలా అని ఆర్సీబీ ఆలోచిస్తోంది. దూకుడు మంత్రంతోనే ఆరెంజ్ ఆర్మీకి చెక్ పెట్టేందుకు ఆర్సీబీ ప్రయత్నిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.