ఈ సీజన్ లో ముంబై బౌలింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కనీసం ఒక్కరైనా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడం వలన గెలవడానికి చాలానే కష్టపడుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆర్చర్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ కే దూరమయ్యాడు. దీంతో ఇప్పుడు ముంబై బౌలింగ్ బాగా వీక్ గా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఆ జట్టుకి ఒక శుభవార్త.ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ముంబై జట్టులో చేరనున్నాడు.
ఈ సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి బ్యాటింగ్ లో తిరుగులేదు. రోహిత్, కిషన్, సూర్య, టిమ్ డేవిడ్ , గ్రీన్, తిలక్ వర్మలతో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. వీరిలో ఏ ఇద్దరు గ్రీజ్ లో నిలబడినా.. భారీ స్కోర్ ఖాయం. తిలక్ వర్మ మినహాయిస్తే.. మిగిలిన వారందరు అంతర్జాతీయ ఆటగాళ్లే కావడం విశేషం. తిలక్ వర్మ కూడా మంచి ఆటగాడనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇక ముంబై సమస్యంతా వారి బౌలింగ్ మీదే. టోర్నీలో ఇప్పటివరకు ఏ ఒక్కరు చెప్పుదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే ఇప్పుడు ఆ జట్టులో ఒక అనుభవం ఉన్న బౌలర్ రానున్నాడు.
ఈ సీజన్ లో ముంబై బౌలింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కనీసం ఒక్కరైనా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడం వలన గెలవడానికి చాలానే కష్టపడుతుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వీరు భారీగా పరుగులివ్వడం ఆ జట్టుని బాగా కలవరపెడుతుంది. బుమ్రా లేకపోవడంతో ఆర్చర్ మీదే ముంబై ఇండియన్స్ ఆశలన్నీ పెట్టుకుంది. కానీ ఆర్చర్ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఇప్పుడు ముంబై ఇండియన్స్ ని దిక్కు తోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆర్చర్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ కే దూరమయ్యాడు. దీంతో ఇప్పుడు ముంబై బౌలింగ్ బాగా వీక్ గా కనబడుతుంది.
అయితే ఇప్పుడు ఆ జట్టుకి ఒక శుభవార్త. ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ జోర్దాన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆర్చర్ కి రీప్లేస్ గా జోర్దాన్ ముంబై జట్టులో చేరనున్నాడు.జోర్డాన్ గత వారమే జట్టులో చేరిన ఎవరి స్థానంలో వచ్చాడనేది ముంబై యాజమాన్యం చెప్పలేదు. తాజాగా ఆర్చర్ గాయపడడంతో జోర్డాన్ అతని ప్లేస్ లో వస్తున్నాడని ప్రకటించింది.టీ 20 క్రికెట్లో జోర్దాన్ బాగా బౌలింగ్ వేస్తాడనే పేరుంది. యార్కర్ల వేయడంలో ఈ పేసర్ దిట్ట. మరి ఇతని రాకైనా ముంబై ఇండియన్స్ ని విజయాల బాట పట్టిస్తుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.