2023 ఐపీఎల్ కోసం కొన్ని రోజుల క్రితమే మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో విదేశీ ఆల్ రౌండర్లపై కాసుల వర్షం కురిపించాయి ప్రాంఛైజీలు. ఇక ఇప్పటి నుంచే ఫ్రాంఛైజీలు తమ తమ జట్లపై ఫోకస్ పెట్టాయి. అయితే నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నె సూపర్ కింగ్స్ ఈ సారి ఎలాగైనా ఐదవ టైటిల్ ను సాధించాలని పట్టుదలతో ఉంది. గత సీజన్ లో దారుణ వైఫల్యంతో అట్టడుగున నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. దాంతో ఈ సీజన్ టైటిల్ ను ఎలాగైనా ఒడిసిపట్టుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇంగ్లాండ్ వరల్డ్ కప్ హీరో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ నేపథ్యంలోనే సూపర్ కింగ్స్ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అప్పుడే తన ప్రాక్టీస్ ను స్టార్ట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేంద్ర సింగ్ ధోని.. వరల్డ్ క్రికెట్ లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. క్రికెట్ లో ఏ ఫార్మాట్ లో అయినా తనదైన ముద్రవేశాడు మిస్టర్ కూల్. ఇక ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నైకు సారథ్యం వహిస్తున్న ధోని.. 2023 ఐపీఎల్ కు సన్నద్ధం అవుతున్నాడు. మిగతా క్రికెటర్లు అందరు టోర్నీలతో బిజీ బిజీగా గడుపుతుంటే.. నేను టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో ధోని.. తన ప్రాక్టీస్ ను మెుదలు పెట్టాడు. ప్రస్తుతం ధోని నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. నెట్స్ లో భారీ షాట్స్ ప్రాక్టీస్ చేస్తూ.. కెమెరాకు చిక్కాడు మహేంద్ర సింగ్ ధోని.
ఇక ఈ వీడియో చూసిన ధోని ఫ్యాన్స్, చెన్నై ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఈ సారి కప్ కొట్టడం ఖాయం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. గత సీజన్ లో ఘోరంగా దెబ్బతిన్న చెన్నై ఈ సారి మంచి ప్రదర్శన కనబరిచి టైటిల్ ఎగరేసుకుపోవాలని చూస్తోంది. ప్రస్తుతం చెన్నై జట్టు ఎక్స్ పీరియన్స్ గల ఆటగాళ్లతో నిండి ఉంది. రవీంద్ర జడేజా, మెుయిన్ అలీ, బెన్ స్టోక్స్ లాంటి భీకర ఆల్ రౌండర్లు జట్టులో ఉన్నారు. వీరు ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చే వీరులు.
Practice session of MS Dhoni ahead of IPL 2023.#IPL #MSDhoni #BorderGavaskarTrophy #Cricket #CricketTwitter #CSK #msdhoni pic.twitter.com/c3zBPBTEaL
— sports cricket (@cricket_new07) January 19, 2023