"మహేంద్ర సింగ్ ధోని " ప్రస్తుతం ఐపీఎల్ లో ఈ పేరు మారు మ్రోగిపోతుంది. నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ అనంతరం టీం ఇండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కి షర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చి తన క్రేజ్ ఎలాంటిదో తెలియజేసిన ధోని.. మరో ఇద్దరు దిగ్గజాలకు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వడం విశేషం.
“మహేంద్ర సింగ్ ధోని ” ప్రస్తుతం ఐపీఎల్ లో ఈ పేరు మారు మ్రోగిపోతుంది. ఎక్కడ చూసిన ధోని మయం. మహేంద్రుడు ఎక్కడ ఉంటే ఫ్యాన్స్ అక్కడ వాలిపోతున్నారు . మ్యాచ్ ఎక్కడ జరిగిన స్టేడియం మొత్తం ఎల్లో కలర్ తో నిండిపోతుంది. ఒక ప్లేయర్ గా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకోవడంలో ఆశ్చర్యం లేకపోయినా.. దిగ్గజాలకు సైతం ధోని నచ్చేస్తున్నాడు. ఈ అభిమానం ఏకంగా దిగ్గజాలు కూడా సామాన్యులుగా మారిపోయి అతని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడం విశేషం. టీం ఇండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కి షర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చి తన క్రేజ్ ఎలాంటిదో తెలియజేసిన ధోని.. మరో ఇద్దరు దిగ్గజాలకు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వడం విశేషం.
ప్రపంచంలో ఆ ఫాస్ట్ బౌలర్ ని చూస్తే ఏ బ్యాటర్ అయినా బయపడాల్సిందే. 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తూ కూడ స్వింగ్ తిప్పడం అతనికే సాధ్యం. అతడెవరో కాదు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్. అలాగే తన స్పిన్ తో బ్యాటర్లని ముప్పుతిప్పలు పెట్టడంలో సిద్ధహస్తుడు శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్. వీరిద్దరు కూడా వారి జెనెరేషన్ లో ఒక బెంచ్ మార్క్ ని వేసినవారు. అయితే వీరు ఇప్పుడు భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటూ కనిపించారు. అలాగే అంతకుముందు సునీల్ గవాస్కర్ కి ధోని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో మూడు తరాల దిగ్గజాలకు ధోని ఆటోగ్రాఫ్ ఇచ్చి అందనంత ఎత్తులో నిలిచాడు. ఇలా దిగ్గజాలు కూడా ఒక ప్లేయర్ దగ్గర ఇలా ఆటోగ్రాఫ్ తీసుకోవడం మాహీకే చెందింది. మరి ఇంతలా అందరిని ఆకట్టుకుంటున్న ధోని ముందు ముందు ఇంకెందరి మనసులు గెలుచుకుంటాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.