'ఇష్టమొచ్చినట్లు బౌలింగ్ చేస్తే.. ఇంకో కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది'. ఆటగాళ్లను ఉద్దేశిస్తూ ధోని ఇచ్చిన ఈ వార్నింగ్ బాగానే పనిచేస్తోంది. సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఆ మాటలు ఓ యువ క్రికెటర్ లో పౌరుషాన్ని నింపాయి. ఇంకేముంది తరువాతి మ్యాచులోనే ధోనీ చెప్పినట్లు చేసి ఫలితాన్ని రాబట్టాడు.
నాలుగు రోజుల క్రితం మహేంద్ర సింగ్ ధోని చెన్నై బౌలర్లపై సీరియస్ అయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో సీఎస్‌కే బౌలర్లు.. ఎక్కువ వైడ్స్, నో బాల్స్ వేశారు. దీనిపై ధోని మ్యాచ్ ముగిశాక మాట్లాడుతూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ప్రదర్శనను మార్చుకోకపోతే.. కెప్టెన్ గా ఉండనని హెచ్చరించాడు. ఆ మాటలు ఓ యువ క్రికెటర్ లో పౌరుషాన్ని నింపాయి. ఇంకేముంది తరువాతి మ్యాచులోనే ధోనీ చెప్పినట్లు చేసి ఫలితాన్ని రాబట్టాడు.
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించినా అది సీఎస్‌కే ధోనికి సంతృప్తినివ్వలేదు. అందుకు బలమైన కారణం.. సీఎస్‌కే బౌలర్లు ఎక్సట్రాల రూపంలో ఎక్కువ పరుగులు ఇవ్వటమే. ఎక్సట్రాల రూపంలో మొత్తం 18 పరుగులు ఇస్తే.. అందులో 13 వైడ్స్ రూపంలోనే వచ్చాయి. దీపక్ చాహర్..5, తుషార్ దేశ్‌పాండే..4, రాజవర్ధన్ హాంగార్కర్.. 3 ఇలా ముగ్గురు పోటీ పడి మరీ వైడ్లు వేశారు. ఇది ధోనీకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఇదే సీన్ మరోసారి రిపీట్ అయితే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందంటూ గట్టి హెచ్చరికలే పంపాడు. ఆ మాటలు తుషార్ దేశ్‌పాండేలో కసిని పెంచాయి.
MS Dhoni said, “Bowlers need to control wides and no balls or else they’ll have to play under a new captain. It’ll be my second warning and then I’ll be off (smiles)”.#CSKvLSG #Chepauk #Chepaukstadium #MSDhoni𓃵 #MSDhoni #IPL23 pic.twitter.com/LWWJp1maqD
— IHD Fantasy Prediction (@FantasyIhd) April 3, 2023
దీంతో తుషార్ దేశ్‌పాండే తరువాతి మ్యాచులోనే ముంబై సారథి రోహిత్ శర్మకు చుక్కలు చూపించాడు. సూపర్బ్ బాల్ తో బోల్తా కొట్టించాడు. అది నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన దేశ్‌పాండే నాల్గవ ఓవర్ ఆఖరి బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రోహిత్(21) మరోసారి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది ధోనీ ఇచ్చిన వార్నింగ్ వల్లే సాధ్యమయ్యిందా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#IPL2023 #MIvsCSK #CSKvMI
Superb wicket 🎉#RohitSharma𓃵 #TusharDeshpande 💪 #ChennaiSuperKings #WhistlePodu
Video courtesy #JioCinema pic.twitter.com/mVHPqsbhYf— Arati Muley (@2Arati) April 8, 2023
Tushar Deshpande 👀🔥#WhistlePodu #IPL2023 #MIvCSK pic.twitter.com/fMHLxxTuLO
— CSK Fans Army™ (@CSKFansArmy) April 8, 2023