పంజాబ్ కింగ్స్‌పై భారీ విజయంతో సంతోషంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ఆల్‌రౌండర్‌కు తీవ్ర గాయమైంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ రియల్ పవర్ ఏంటో చూపించింది. అందరూ తక్కువ అంచనా వేస్తున్న లక్నో టీమ్.. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ జట్టు బ్యాటర్ల సుడిగాలి ఇన్నింగ్స్‌ల ధాటికి ప్రత్యర్థి బౌలర్లు బిత్తరపోయారు. ఇదేం హిట్టింగ్ రా బాబు అంటూ నోరెళ్లబెట్టారు. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 257 రన్స్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. లక్నో ఇన్నింగ్స్‌లో మార్కస్ స్టొయినిస్ (72), కైల్ మేయర్స్ (54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరికి తోడుగా ఆయుష్ బదోని (43), నికోలస్ పూరన్ (45) కూడా చక్కగా ఆడటంతో లక్నో భారీ స్కోరు చేసింది.
భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆ టీమ్ సారథి శిఖర్ ధవన్ 1 రన్‌కే పెవిలియన్‌కు చేరాడు. అయితే అథర్వ తైదే (66), సికిందర్ రాజా (36) మంచి భాగస్వామ్యంతో గెలుపుపై ఆశలు చిగురించాయి. లివింగ్‌స్టోన్ (23), సామ్ కరన్ (21) తదితరులు ఫర్వాలేదనిపించినప్పటికీ పంజాబ్‌ను విజయతీరానికి చేర్చలేకపోయారు. భారీ రన్స్ ఛేదనలో పంజాబ్ 201 స్కోరుకే పరిమితమైంది. అయితే గెలుపు జోష్‌లో ఉన్న లక్నోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ దురదృష్టవశాత్తు గాయపడ్డాడు.
పంజాబ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే కెప్టెన్ శిఖర్ ధావన్‌ను ఒక అద్భుతమైన బాల్‌తో బోల్తా కొట్టించిన స్టొయినిస్.. మూడో ఓవర్లో గాయపడ్డాడు. అథర్వ తైదే స్ట్రైట్ డ్రైవ్ ఆడిన బాల్‌ను ఆపే క్రమంలో ఎడమ చూపుడు వేలికి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే గ్రౌండ్‌ను వీడాడు స్టొయినిస్. వెంటనే అతడ్ని స్కానింగ్ కోసం తరలించారు. ఇదే విషయాన్ని ఈ స్టార్ ఆల్‌రౌండర్ తెలిపాడు. ప్రస్తుతం తనకు బాగానే ఉందన్న స్టొయినిస్.. స్కానింగ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. ఒకవేళ స్టొయినిస్‌కు అయిన గాయం తీవ్రమైనదని తేలితే అతడు తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే స్టొయినిస్ స్థానంలో ఎవర్ని ఆడిస్తారో చూడాలి.
We will get scans done: Marcus Stoinis on his finger injury
Read @ANI Story | https://t.co/lh1bbseN2X#MarcusStoinis #LSG #IPL2O23 pic.twitter.com/qSkwrKskMr
— ANI Digital (@ani_digital) April 29, 2023