గ్రౌండ్ లో ధోని తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించబడింది. అయితే ధోని ఇచ్చిన ఒక సలహా.. ఇప్పుడు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగకి నచ్చడం లేదని తెలుస్తుంది. మరి ధోని ఏం సలహా ఇచ్చాడు? మలింగ ఎందుకు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు.
గ్రౌండ్ లో ధోని తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించబడింది. అందుకే ధోని నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. అదే విధంగా వ్యక్తిగతంగా ధోని ఇచ్చే సలహాల కోసం ఎంతో మంది అప్ కమింగ్ ప్లేయర్లు ఎదురు చూస్తారు. ఈ క్రమంలో శ్రీలంక యువ సంచలనం మతీశ్ పతిరాణాను చూసి ఇంప్రెస్స్ అయిన ధోని.. అడగకుండానే అతని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని బహిరంగగానే ఒక సలహా ఇచ్చాడు. అయితే ధోని ఇచ్చిన ఈ సలహా.. ఇప్పుడు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగకి నచ్చడం లేదని తెలుస్తుంది. మరి ధోని ఏం సలహా ఇచ్చాడు? మలింగ ఎందుకు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు.
ఐపీఎల్ 2023 లో శ్రీలంక పేసర్ పతిరానా అద్భుతంగా రాణిస్తున్నాడు. కేవలం 20 లక్షల బేస్ ప్రైజ్ తో వేలంలో అతన్ని దక్కించుకున్న చెన్నై యాజమాన్యం అతడి మీద నమ్మకముంచి వరుస అవకాశాలు ఇస్తుంది. ఈ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్న పతిరానా.. ప్రస్తుతం చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ప్రధాన బౌలర్ గా మారాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఈ జూనియర్ మలింగ.. యార్కర్లతో చెలరేగిపోతున్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సైతం పతిరానా బౌలింగ్ కి ఫిదా అయిపోయి ఫ్యాన్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో పతిరానాకి ఒక కీలకమైన సలహా ఇచ్చాడు. అతడు భవిష్యత్తులో టెస్టు క్రికెట్ ఆడకుండా.. అతని సేవలను కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ కే వాడుకోవాలని సూచించాడు. దీనిపై మలింగా స్పందిస్తూ ధోని మీద షాకింగ్ కామెంట్స్ చేసాడు.
మలింగ మాట్లాడుతూ.. పతిరానా గాయాలకు బయపడి టెస్టు క్రికెట్ కి దూరంగా ఉండాల్సిన అవరసరం లేదు. టెస్టు క్రికెట్ ఆడితేనే పతిరానా బౌలింగ్ మెరుగుపడుతుంది. కెరీర్ ఆరంభంలో నేను కూడా టెస్టులు ఆడినవాడినే. ధోని ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసాడో అర్ధం కావడం లేదు. ఒకవేళ ధోని గనుక ఈ వ్యాఖ్యలు సీరియస్ గా చేసి ఉంటే మాత్రం ఈ మాటలను నేను పూర్తిగా ఖండిస్తాను. అయితే మరో శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ మాత్రం ధోనికి మద్దతుగా నిలిచాడు. మరి మలింగ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.