లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ మజిల్ పవర్ ఏంటో చూపింది. ఆ జట్టు బ్యాటర్ల విధ్వంసానికి ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగిపోయారు.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పడుతూ లేస్తూ ముందుకెళ్తోంది. ఆడిన ఏడు మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచిన లక్నో జట్టు.. మిగిలిన మూడింట్లో ఓటమి పాలైంది. లక్నో ఓటములకు బ్యాటింగ్ ఫెయిల్యూర్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఆ టీమ్‌లోని ఆటగాళ్లు తమ సత్తాకు తగ్గట్లుగా ఆడట్లేదు. ముఖ్యంగా సారథి కేఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాహుల్ స్లో బ్యాటింగ్ చూడలేకపోతున్నామని.. అతడు ఇలాగే ఆడితే కష్టమని సాధారణ ఆడియెన్స్‌తో పాటు లక్నో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. విమర్శలు లక్నో జట్టు వరకు వచ్చాయో ఏమో గానీ.. ఆ జట్టు సత్తా చాటింది.
లక్నో టీమ్ అసలైన పవర్ ఏంటో చూపించింది. జెయింట్ పదానికి నిజమైన అర్థం ఏంటో చాటి చెప్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనే రెండో అత్యధిక స్కోరు సాధించింది లక్నో జట్టు. పంజాబ్ కింగ్స్ మీద 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఏకంగా 257 రన్స్ చేసింది. లక్నో బ్యాటర్లు కైల్ మేయర్స్ (54), మార్కస్ స్టొయినిస్ (72) తమ మజిల్ పవర్ ఏంటో చూపారు. వీళ్లిద్దరి హాఫ్ సెంచరీలకు తోడుగా ఆయుష్ బదోని (43), నికోలస్ పూరన్ (45) కూడా దంచికొట్టడంతో లక్నో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. వీళ్ల బాదుడుకు ప్రత్యర్థి జట్టులోని అంతర్జాతీయ బౌలర్లు కూడా తేలిపోయారు. భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు తడబడుతోంది. ప్రస్తుతానికి ఆ టీమ్ 4.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 33 రన్స్ చేసింది. పంజాబ్ సారథి శిఖర్ ధవన్ కేవలం 1 రన్ చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
So close yet so far for Lucknow Super Giants 😞
📸: Jio Cinema pic.twitter.com/Bql77B1Ylg
— CricTracker (@Cricketracker) April 28, 2023