ఆర్సీబీ అభిమానులకి శుభవార్త. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. కెప్టెన్ డుప్లెసిస్ అందుబాటులో ఉన్నప్పటికీ.. గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. దీని ప్రకరాం డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్ గా జట్టులో కొనసాగనున్నాడు.
ఆర్సీబీ అభిమానులకి శుభవార్త. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. కెప్టెన్ డుప్లెసిస్ అందుబాటులో ఉన్నప్పటికీ.. గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా డుప్లెసిస్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ మధ్యలో కాస్త అసౌకర్యంగా కనిపించాడు. దీంతో చికిత్స తీసుకున్న ఫాఫ్ కాసేపటికే ఔటయ్యాడు. ప్రస్తుతం పూర్తిగా ఫిట్ నెస్ లేకపోవడంతో డుప్లెసిస్ సేవలు కేవలం లు బ్యాటింగ్ కోసం వాడుకోవాలని ఆర్సీబీ చూస్తుంది.
ఐపీఎల్ లో భాగంగా నేడు బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ ముందు టాస్ సమయంలో పంజాబ్ కెప్టెన్ సామ్ కరణ్ తో పాటుగా కోహ్లీ రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో గ్రౌండ్లో కోహ్లీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కోహ్లీ.. కోహ్లీ అంటూ స్టేడియం మారు మ్రోగిపోయింది. ఇదిలా ఉండగా.. టాస్ పంజాబ్ గెలవడంతో కరణ్ ఫిల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో డుప్లెసిస్ గాయం కారణంగా కెప్టెన్సీ చేయడం లేదు. ఫీల్డింగ్ సమయంలో అతడికి రెస్ట్ ఇవ్వాలని భావించాం అని చెప్పుకొచ్చాడు. దీని ప్రకరాం డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్ గా జట్టులో కొనసాగనున్నాడు అని తెలుస్తుంది.
2021 లో విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ మీద దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. దీంతో డుప్లెసిస్ బెంగళూరు జట్టుకి నాయకత్వ బాధ్యతలు చెప్పట్టాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ 5 మ్యాచుల్లో 3 విజయాలు సాధించగా.. బెంగళూరు 5 మ్యాచుల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 8 వ స్థానంలో నిలిచింది. మరి ఈ రోజు జరగబోయే మ్యాచులో ఎవరు గెలుస్తారో చూడాలి. మొత్తానికి చాలా రోజుల తర్వాత కోహ్లీ కెప్టెన్సీ చేయనుండడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
The sight we’ve missed for so long! King Kohli back in charge! 😍🫡
Only smiles on the faces of both stand-in captains! 😁🤝#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #PBKSvRCB pic.twitter.com/7yv6FHd0Ie
— Royal Challengers Bangalore (@RCBTweets) April 20, 2023