ఐపీఎల్ పదహారో సీజన్ కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్‌కు టైమ్ దగ్గరపడుతోంది. దీంతో ప్రతి మ్యాచ్ గెలవడం, నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకోవడంపై అన్ని జట్లు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏయే జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్స్ ఎంతమేర ఉందో తెలుసుకుందాం..
ఈ ఏడాది ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. దాదాపు ప్రతి జట్టు 10 నుంచి 11 మ్యాచ్‌లు ఆడేయడంతో ఏ టీమ్ ప్లేఆఫ్స్‌కు చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇన్ని మ్యాచ్‌లు అయిపోయినా, ప్లేఆఫ్స్‌కు ఏయే జట్లు చేరతాయనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ (11 మ్యాచుల్లో 8 విజయాలు), రెండో పొజిషన్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (11 మ్యాచుల్లో 6 విజయాలు) సులువుగా ప్లేఆఫ్స్‌లో చోటు సంపాదించేలా ఉన్నాయి. అయితే మిగిలిన రెండు పొజిషన్ల కోసం మాత్రం గట్టిపోటీనే ఎదురువుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు (11 మ్యాచుల్లో 6 విజయాలు) పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ చెరో 11 మ్యాచులు ఆడి ఐదేసి విజయాలు సాధించాయి.
ప్లేఆఫ్స్‌లో రెండు స్థానాల కోసం ఈ ఆరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏయే జట్ల ప్లేఆఫ్స్ ఛాన్సులు ఎంతమేర ఉన్నాయో తెలుసుకుందాం.. పాయింట్ల టేబుల్లో టాప్‌లో ఉన్న గుజరాత్‌కు ప్లేఆఫ్ అవకాశాలు 99.7 శాతం ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. టేబుల్లో సెకండ్ పొజిసన్లో ఉన్న చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు 82 శాతం అవకాశం ఉంది. ఆ తర్వాత ప్లేఆఫ్స్‌లో నిలిచే ఛాన్స్ అధికంగా ఉన్న జట్లుగా ముంబై ఇండియన్స్ (62 శాతం), లక్నో సూపర్ జెయింట్స్ (45 శాతం)ను క్రికెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక, రాజస్థాన్ (26 శాతం), కేకేఆర్ (24 శాతం), ఆర్సీబీ (23 శాతం) వరుస విజయాలు సాధిస్తూ నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకుంటే తప్ప ప్లేఆఫ్స్ రేసులో నిలిలే అవకాశాలు లేవని చెబుతున్నారు. పంజాబ్ (15 శాతం), ఎస్ఆర్హెచ్ (13 శాతం), డీసీ (11 శాతం) జట్లు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లేఆఫ్స్‌కు చేరే సూచనలు కనిపించడం లేదు.
IPL 2023 Playoffs Chances:
GT – 99.7%.
CSK – 82%.
MI – 62%.
LSG – 45%.
RR – 26%.
KKR – 24%.
RCB – 23%.
PBKS – 15%.
SRH – 13%.
DC – 11%.— Mufaddal Vohra (@mufaddal_vohra) May 9, 2023