KKR vs MI Prediction: ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ 2023లో అన్ని జట్లు క్రికెట్ అభిమానులు బోలెడంత వినోదాన్ని అందిస్తున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్ కూడా చివరి బాల్, చివరి ఓవర్ వరకు వెళ్తున్నాయి. ఒక వారం రోజుల నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఏకపక్షంగా సాగలేదు. థ్రిల్లర్ సినిమాలను మించి సాగుతున్నాయి మ్యాచ్‌లు. ఈ క్రమంలోనే మరో బిగ్ ఫైట్‌కు రంగం సిద్దమైంది. ఆదివారం డబుల్ హెడ్డర్ కావడంతో.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తలపడుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
ముంబై ఇండియన్స్..
తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ మూడో మ్యాచ్‌లో విజయంతో గాడిలోపడింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం ముంబైకి కొండంత బలం ఇచ్చింది. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ సైతం పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం పరుగులు చేస్తే పటిష్టంగా మారుతుంది. కామెరున్ గ్రీన్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మతో ముంబై బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ.. బౌలింగ్‌లోనే ముంబై కాస్త వీక్‌గా కనిపిస్తోంది. ఆర్చర్‌పై ఆశలు పెట్టుకుంటే అతను దారుణంగా నిరాశ పరిచాడు. అతను లేకుండానే ముంబై మూడో మ్యాచ్‌లో గెలిచింది.
కోల్‌కత్తా నైట్ రైడర్స్..
మంచి బౌలింగ్ ఎటాక్‌తో, యువ క్రికెటర్లు రింకూ సింగ్, కెప్టెన్ నితీష్ రాణా రాణిస్తుండటంతో కేకేఆర్ పటిష్టంగా మారింది. బౌలింగ్‌లో పెర్గూసన్, ఉమేష్ యాదవ్‌తో పాటు ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరణ్ చక్రవర్తి కోల్‌కత్తా సొంతం. వీరిని ఎదుర్కొని పెద్ద స్కోర్ చేయడం ప్రతి సారి సాధ్యం కాకపోవచ్చు. ఎవరూ క్లిక్ అయినా.. ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చగలరు. అయితే.. కేకేఆర్‌ను ఓపెనింగ్ సమస్య వేధిస్తూనే ఉంది. ఒక మ్యాచ్‌లో బాగా ఆడిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ గుర్బాజ్ మళ్లీ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. కేకేఆర్ బౌలింగ్ ఎటాక్ బలంగా కనిపిస్తున్నా.. భారీగా పరుగులు సమర్పించుకోవడం ఇబ్బంది పెడుతున్న అంశం.
తుది జట్లు అంచనా..
KKR: జాసన్ రాయ్, జగదీశన్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లూకీ పెర్గుసన్, వరుణ్ చక్రవర్తి.
MI: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ శర్మ, కామెరున్ గ్రీన్, టిమ్ డేవిడ్, నెహల్, కుమార్ కార్తీకేయ, మెరిడెత్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, బెరెన్‌డ్రూఫ్
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించే అవకాశం ఉంది. సొంత మైదానంలో ఆడటం ముంబైకి అదనపు బలం.