CSK vs RR Prediction: ఇప్పటికే చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి.. మంచి పొజిషన్స్‌లో ఉన్నాయి.. ఇప్పుడు మూడో గెలుపు కోసం రాజస్థాన్-చెన్నై జట్లు పోటీ పడుతున్నాయి. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ 2023లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. వరుసగా మూడు రోజుల నుంచి ప్రతి మ్యాచ్ చివరి బాల్ వరకు వెళ్లి థ్రిల్లర్ మూవీలను మించి జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో బిగ్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. బుధవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. రెండు జట్లు కూడా మూడేసి మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించాయి. ఈ మ్యాచ్‌తో మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. మరి ముచ్చటగా మూడో విజయం ఎవరికి దక్కుతుందో చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్..
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. ఆ తర్వాత రెండు వరుస విజయాలు సాధించి మంచి జోరు మీదుంది. అయితే.. ఓపెనర్ డెవాన్ కావ్వె ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటివల టీమ్‌లోకి వచ్చిన అజింక్యా రహానే సైతం మంచి టచ్‌లో ఉన్నాడు. మొయిన్ అలీ, శివమ్ దూబే, జడేజా, ధోనితో బ్యాటింగ్ బలంగానే కనిపిస్తున్నా.. నిలకడలేమి సమస్యగా మారింది. ఇక బౌలింగ్‌లో సాంట్నర్, హంగార్గేకర్, మహీష్ తీక్షణ, తుషార్ పాండేతో బలంగానే ఉంది. లంక ప్లేయర్ తీక్షణ రాకతో చెన్నై కాస్త బలపడిందనే చెప్పాలి. అలాగే మ్యాచ్ హోం గ్రౌండ్ కావడం చెన్నైకు కలిసొచ్చే అంశం.
రాజస్థాన్ రాయల్స్..
రాజస్థాన్‌కు బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. యశస్వి జైస్వాల్-జోస్ బట్లర్ రూపంలో అదరిపోయే ఓపెనింగ్ పెయిర్ వారి సొంతం. పైగా ఇద్దరూ ఫామ్‌లో ఉండటం ప్లస్ పాయింట్. అలాగే కెప్టెన్ సంజు శాంసన్ ఇంకా స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ధృవ్ జురెల్ మంచి టచ్‌లో ఉన్నాడు. షింరోన్ హెట్‌మేయర్, హోల్డర్‌తో మిడిల్డార్ పటిష్టంగా ఉంది. రియాన్ పరాగ్ కూడా ఉన్నా సరిగా ఆడటం లేదు. బౌలింగ్‌లో మాత్రం రాజస్థాన్ దుర్బేధ్యంగా ఉంది. పైగా అశ్విన్ హోం గ్రౌండ్‌లో మ్యాచ్ కావడం, చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటం, అశ్విన్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు రాజస్థాన్ సొంతం. అలాగే ట్రెంట్ బౌల్ట్, హోల్డర్‌లతో పేస్ ఎటాక్ బలంగా ఉంది.
తుది జట్ల అంచనా..
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కావ్వె, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మిచెల్ సాంట్నర్, రాజ్‌వర్ధన్ హంగార్గేకర్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే.
రాజస్థాన్: జైస్వాల్, బట్లర్, సంజు శాంసన్, ధృవ్ జురెల్ , షింరోన్ హెట్‌మేయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, మురగన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించే అవకాశం ఉంది.
#CSKvsRR Dhoni and Sanju practice at same spot 😍 #IPL2023 pic.twitter.com/uncmRhiltC
— InfoPlus Malayalam (@InfoPlusMal) April 11, 2023