బెంగళూరు-లక్నో మధ్య సోమవారం(ఏప్రిల్ 10)న జరిగిన మ్యాచ్ లో ఓ భారీ సిక్స్ నమోదు అయ్యింది. డుప్లెసిస్ బాదిన ఈ సిక్స్ ఏకంగా గ్రౌండ్ బయటపడింది. ఈ ఐపీఎల్ లో ఇదే అత్యంత భారీ సిక్స్ కావడం విశేషం.
ఐపీఎల్ అంటేనే సిక్స్ లు, ఫోర్లు. ఇక ప్రతీ మ్యాచ్ లో దాదాపు బౌండరీల మోత మోగుతూనే ఉంటుంది. అయితే కొన్ని మ్యాచ్ ల్లో మాత్రం రికార్డు బ్రేక్ సిక్స్ లు నమోదు అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి రికార్డ్ బ్రేక్ సిక్స్ ఒకటి బెంగళూరు-లక్నో మధ్య సోమవారం(ఏప్రిల్ 10)న జరిగిన మ్యాచ్ లో నమోదు అయ్యింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో జట్టుకు చుక్కలు చూపించారు బెంగళూరు ఓపెనర్స్ విరాట్ కోహ్లీ-డుప్లెసిస్. తొలి వికెట్ కు 11 ఓవర్లలో అభేద్యమైన 96 పరుగులు జోడించారు. ఇక ఆ భారీ సిక్స్ గురించి తెలుసుకుందాం.
ఐపీఎల్ 2023లో భాగంగా.. సోమవారం(ఏప్రిల్ 10)న బెంగళూరు-లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ నెగ్గిన లక్నో టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగింది ఆర్సీబీ జట్టు. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ-డుప్లెసిస్ లు మెుదటి నుంచి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో 11 ఓవర్లలకు 96 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆఫ్ సెంచరీ చేసి మంచి ఊపు మీదున్న విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లలో 61 రన్స్ చేసి అమిత్ మిశ్రా చేతికి చిక్కాడు.
ఇక ఆ తర్వాత డుప్లెసిస్ రెచ్చిపోవడం స్టార్ట్ చేశాడు. ఈక్రమంలోనే లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్ లో డుప్లెసిస్ ఓ భారీ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని భారీ సిక్స్ గా మలిచాడు డుప్లెసిస్. దాంతో బంతి కాస్త గ్రౌండ్ అవతల పడింది. దాంతో 115 మీటర్ల భారీ సిక్స్ ఈ ఐపీఎల్ లో నమోదు అయ్యింది. ఇది వరకు ఈ రికార్డు శివం దుబే పేరు మీద ఉంది. ఇక ఇంత భారీ సిక్స్ కొట్టడం చూసిన గ్లెన్ మాక్స్ వెల్ నవ్వుతూ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆర్సీబీ దుకుడుగా ఆడుతోంది. డుప్లెసిస్-మాక్స్ వెల్ సిక్సర్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడుతున్నారు.
The biggest six of IPL 2023 – Faf Du Plessis with a gigantic 115M six. pic.twitter.com/GdrYeEsWKt
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2023