కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ సంగతి మనందరికి తెలిసిందే. దాంతో అతడి స్థానాన్ని ఏ ఆటగాడితో భర్తీ చేస్తారా అని KKR ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. ఇక వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. కేకేఆర్ విధ్వంసకర ఓపెనర్ ను అయ్యర్ స్థానంలోకి తీసుకుంది.
IPL 2023 సీజన్ ను తొలి నుంచి గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక సీజన్ ప్రారంభానికి ముందే స్టార్ ప్లేయర్స్ అందరు గాయాల కారణంగా ఈ మెగా ఈవెంట్ కు దూరం అయ్యారు. జస్ప్రీత్ బూమ్రా, కేన్ విలియమ్సన్, శ్రేయస్ అయ్యర్, షకీబ్ అల్ హసన్ లతో పాటుగా మరికొంత మంది స్టార్ ప్లేయర్స్ ఈ సీజన్ ను దూరం అయ్యారు. దాంతో వారి ప్లేస్ లను భర్తీ చేసేందుకు ఫ్రాంఛైజీలు ఇతర ప్లేయర్ల వైపు చూడాల్సి వస్తోంది. ఇక తాజాగా కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ సంగతి మనందరికి తెలిసిందే. దాంతో అతడి స్థానాన్ని ఏ ఆటగాడితో భర్తీ చేస్తారా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. ఇక వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. కేకేఆర్ విధ్వంసకర ఓపెనర్ ను అయ్యర్ స్థానంలోకి తీసుకుంది.
కోల్ కత్తా నైట్ రైడర్స్.. ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచ్ లోనే వరుణుడి రూపంలో అపజయం పలకరించింది. దాంతో పంజాబ్ పై డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక కేకేఆర్ జట్టుకు టోర్నీ ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా టోర్నీకి దూరం అయ్యాడు. దాంతో అతడి స్థానంలో సారథిగా యంగ్ ప్లేయర్ నితీశ్ రాణాను నియమించింది కేకేఆర్ యాజమాన్యం. ఇక అయ్యర్ స్థానంలో ఎవరిని తీసుకుంటారు అని ఫ్యాన్స్ మెుత్తం ఆత్రుతగా ఎదురుచూశారు. తాజాగా శ్రేయస్ స్థానంలో.. ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ జేసన్ రాయ్ ను కొనుగోలు చేసింది.
ఈ క్రమంలోనే అతడిని రూ. 2.8 కోట్లకు జట్టులోకి తీసుకుంది. దాంతో కేకేఆర్ జట్టు స్ట్రాంగ్ గా తయ్యారు అయ్యింది. అయితే సమకాలీన క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రాయ్ కేకేఆర్ తరుపున ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఇక గురువారం (ఏప్రిల్ 6)న బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ తో కేకేఆర్ తన హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్ లో తలపడబోతోంది. ఈ మ్యాచ్ చూడ్డానికి బాలీవుడ్ బాద్ షా కింగ్ షారుఖ్ ఖాన్ వస్తాడని సమాచారం. మరి శ్రేయస్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాయ్ అతడిలా రాణిస్తాడా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.