దేశంలో కుక్కల బెడద రోజురోజుకీ తీవ్రమవుతోంది. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకూ వీటితో సమస్యలు తప్పడం లేదు. తాజాగా ఒక క్రికెటర్ కుక్క కాటు బారిన పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
దేశంలో ఈమధ్య వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తేడాల్లేకుండా అని చోట్లా ఈ కుక్కల సమస్య పెరిగిపోతోంది. చిన్నారుల పైనే కాదు పెద్దవారి మీదా కుక్కులు దాడులు చేస్తున్నాయి. ఈ ఘటనల్లో కొందరు చనిపోగా.. మరికొందరు ఆస్పత్రుల పాలవుతుండటాన్ని వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కాగా, తాజాగా ఒక క్రికెటర్ కుక్క కాటుకు గురయ్యాడు. అతను మరెవరో కాదు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్. మరికొన్ని గంటల్లో లక్నో, ముంబై మధ్య మ్యాచ్ మొదలవనున్న తరుణంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లక్నోలోని ఏక్నా స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా తనను ఒక కుక్క కరిచిందని అర్జున్ టెండూల్కర్ తెలిపాడు.
అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ వేసే ఎడమ చేతికే కుక్క కరవడంతో అతడు ప్రాక్టీస్ చేయకుండానే వెళ్లిపోయాడని సమాచారం. కుక్క కాటు విషయాన్ని అర్జున్.. తన మిత్రులు యుధ్వీర్ సింగ్, మోసిన్ ఖాన్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే తనకు కుక్క కరిచిందని అర్జున్ చెబుతున్న ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్లేఆఫ్స్ రేసులో ముంబై ఇండియన్స్ దూసుకెళ్తోంది. వరుసగా మ్యాచ్‌లు గెలుస్తున్న రోహిత్ సేన.. తదుపరి ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గితే అలవోకగా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఒక మ్యాచ్‌లో గెలిచి, మరోదాంట్లో ఓడితే అప్పుడు మిగతా జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.
Arjun Tendulkar gets bitten by a dog 🤯
He reveals in this video:
Credits- @LucknowIPL pic.twitter.com/iouznDFnku— All About Cricket (@allaboutcric_) May 16, 2023