ఐపీఎల్ 2022లో మంగళవారం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరింది. రాజస్థాన్ రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్2లో పోటీ పడనుంది. కాగా ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అశ్విన్ చేసిన ఒక పనిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 19వ ఓవర్ చివరి బంతికి టాప్ గేర్‌లో ఉన్న జోస్ బట్లర్ రెండో పరుగు కోసం వచ్చి అవుట్ అయ్యాడు. అది కాస్తా నోబాల్ అవ్వడంతో కొత్త బ్యాటర్ క్రీజ్‌లోకి రావాల్సి వచ్చింది.
ఇన్నింగ్స్ చివరి బంతి ఎదుర్కొనేందుకు అశ్విన్ బ్యాటింగ్ వచ్చాడు. ఆఫ్‌సైడ్ వైడ్ యార్కర్ కోసం ప్రయత్నించి యష్ దయాళ్ వైడ్ వేశాడు. చివరి బంతికి ఎలాగైన పరుగుల తీయాలనే ఉద్దేశంతో నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రియాన్ పరాగ్ వైడ్ బాల్ వెళ్లి కీపర్ చేతుల్లో పడేలోపు స్ట్రైకింగ్ ఎండ్‌కు వచ్చేశాడు. అశ్విన్ మాత్రం అక్కడి నుంచి కనీసం కదల్లేదు. దీంతో రియాన్ పరాగ్ రనౌట్ అయ్యాడు. రన్ ఎందుకు తీయలేదని అక్కడే పరాగ్ తన అసహనం వ్యక్తం చేశాడు. నిజానికి ఇన్నింగ్స్ చివరి బాల్‌కు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని ఏ జట్టు ఆటగాళ్లు అయిన భావిస్తారు. బాల్ బ్యాట్‌కు తగలకున్నా.. బైస్ రూపంలో అయిన రన్ తీసేందుకు ప్రయత్నిస్తారు. అశ్విన్ పరిగేత్తి ఉంటే వైడ్‌తో పాటు, మరో రన్ అదనంగా వచ్చేది. చివరి బంతిని పరాగ్ ఆడేవాడు.అలా కాకుండా.. అశ్విన్ సింగిల్‌ను నిరాకరించి తనే స్ట్రైక్‌లో ఉండాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో అశ్విన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘నువ్వేమన్న ధోని అనుకుంటున్నావా?’ లాస్ట్ ఓవర్‌లో సింగిల్ తీయకుండా.. ధోనిలా ఫీల్ అవుతున్నావ్ అంటూ అశ్విన్‌పై సెటైర్లు పేలుస్తున్నారు. పరాగ్‌ను రనౌట్ చేసి, సింగిల్ తీయకుండా.. చివరి బంతికి అశ్విన్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడంతో నెటిజన్లు మరింత విరుచుకుపడుతున్నారు. ‘ఏదో మంచి బ్యాటింగ్ పిచ్‌పై ఒక హాఫ్ సెంచరీ చేసినంత మాత్రనా నువ్వేమైన హార్డ్ హిట్టర్ అనుకుంటున్నావా? పరాగ్ ఉంటే లాస్ట్ బాల్ సిక్స్ కొట్టేవాడు ’ అంటూ అశ్విన్‌ను ఆడుకుంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 89 పరుగులు చేసి రాణించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, పాండ్యా, దయాళ్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇక భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌ను ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్‌లోనే ఫామ్‌లో ఉన్న సాహాను అవుట్ చేసి దెబ్బతీశాడు. ఆ తర్వాత మాథ్యూ వేడ్, శుభ్‌మన్ గిల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ.. సమన్వయ లోపంతో గిల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌లో 35 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కొద్ది సేపటికి వేడ్ 30 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఇక్కడి నుంచి కెప్టెన్ హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ముగించారు. పాండ్యా 27 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు, మిల్లర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఈ సీజన్‌తోనే బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే ఫైనల్ చేరి అదరగొట్టింది. మరి ఈ మ్యాచ్‌లో అశ్విన్ సింగిల్ తీయకుండా స్ట్రైక్ ఉంచుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: AB de Villiers: RCB ఫాన్స్ కు గుడ్ న్యూస్..! రీఎంట్రీ ఇవ్వనున్న ఏబీ డివిలియర్స్!
WATCH: Riyan Parag gives a death stare to Ravichandran Ashwin after his run-out vs Gujarat https://t.co/0w7Upc8vd1 #IPL #RiyanParag
— FirstSportz (@SportzFirst) May 24, 2022