ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు అయిపోయాయి. గుజరాత్, రాజస్థాన్, లక్నో, బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరాయి. ముఖ్యంగా ముంబై విజయంతో ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆనందానికి అధులు లేకుండా పోయాయి. ఆర్సీబీ జట్టు- సిబ్బంది మొత్తం ముంబై vs ఢిల్లీ మ్యాచ్ టాస్ నుంచి లాస్ట్ బాల్ వరకు కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు. నిజానికి ముంబై జట్టు కోచ్ లు కూడా అంతలా చూసుండరు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఆర్సీబీ తమ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే అంతా బానే ఉంది గానీ, హేజల్ వుడ్ మాత్రం ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నాడు. ఎందుకంటే వీడియోలో కనిపించినంత సేపు ఎంతో కామ్ గా, రాముడు మంచి బాలుడు అనే విధంగా జోష్ హేజల్ వుడ్ కనిపించాడు. ఢిల్లీ వికెట్ పడినా, ముంబై ప్లేయర్ సిక్సు కొట్టినా ఎలాంటి చలనం లేదు. అదేంటో.. ముంబై గెలవడం తనకి ఇష్టం లేదు అనే ధోరణిలో అతని ప్రవర్తన కనిపించింది. వీడియో సగం నుంచి అసలు హేజల్ వుడ్ కనిపించలేదు. కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ సైతం ఆనందం పట్టలేక కేకలు వేయడం, డాన్సులు చేయడం చేశారు.
I love it ❤❤
I love RCB and VIRAT KOHLI ❤❤❤💯💯Win kisi ki but khushiya kahi aur bani ti kl raat ko
All RCBIANS , we are in playoffs 🥳🥳
All VIRATIANS ❤💯
Thank you MI paltan 💙RCB RCB RCB………..https://t.co/NS4YRBfnb7#RCB #ViratKohli𓃵 #KingKohli #TejRan pic.twitter.com/k2r5kKH6gG
— Vikash_VK_TejRan ❤ (@Imviratarmy) May 22, 2022
కానీ, ఎక్కడా హేజల్ వుడ్ కనిపించలేదు. అందుకేనేమో.. ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం అతడిని ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏంటి ముంబై మ్యాచ్ ఓడిపోతే చక్కగా ఇంటికెళ్లచ్చు అనుకుంటున్నావా? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వెళ్లడం హేజల్ వుడ్ కి అస్సలు ఇష్టం ఉన్నట్లుగా లేదే అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి హేజల్ వుడ్ అలా ఉండటానికి కారణం ఏంటో తెలియదు గానీ, ఫ్యాన్స్ ఆగ్రహానికి మాత్రం బలయ్యాడు. హేజల్ వుడ్ అలా ఎందుకు ఉన్నాడు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.