ఐపీఎల్ 2022లో మంగళవారం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరింది. రాజస్థాన్ రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్2లో పోటీ పడనుంది. ఈ ఓటమిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందిస్తూ.. కొన్ని ఎక్స్‌ట్రా పరుగులు.. ఒకరిద్దరి చెత్త ఓవర్లు గుజరాత్ టైటాన్స్ చేతిలో తమ ఓటమికి కారణమయ్యాయని అన్నాడు. తమకు లక్ కలిసి రాలేదని, టాస్ ఓడటం శాపంగా మారిందని, చేజింగ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలించిందని తెలిపాడు.
తమ బ్యాటింగ్ సమయంలో బంతి ఆగి రావడంతో పాటు అనూహ్య బౌన్స్, స్వింగ్ అయ్యిందని చెప్పిన సంజూ… దాంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిందన్నాడు. కానీ చేజింగ్‌లో మాత్రం పరిస్థితులు బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా మారాయని చెప్పుకొచ్చాడు. ‘స్వింగ్, అనూహ్య బౌన్స్‌తో బ్యాటింగ్ కష్టంగా మారిన పరిస్థితుల్లో మేం పోరాడే లక్ష్యాన్నే ప్రత్యర్థి ముందు ఉంచాం. కానీ గుజరాత్ బ్యాటర్లు అద్భుతంగా ఆడి లక్ష్యాన్ని ఛేదించారు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా వికెట్ బ్యాటింగ్‌కు కష్టంగా కనిపించింది. కానీ అదృష్టవశాత్తు నేను పవర్ ప్లేలో పరుగులు రాబట్టగలిగాను. ఈ పరిస్థితుల్లో మేం నిర్థేశించిన లక్ష్యం కాపాడుకోదగినదే. పైగా మాకు అత్యుత్తమ బౌలింగ్ ఎటాక్ ఉంది. మా ప్రధాన ఐదుగురు బౌలర్లు టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించారు. వారికి రియాన్ పరాగ్ సైతం సహకారం అందించాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఆ జోరు చూపట్టలేకపోయారు. పైగా వికెట్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ టైమ్‌లో చాలా మారింది. బ్యాట్‌పైకి బంతి సులువుగా వచ్చిందని అన్నాడు. క్వాలిఫైయర్ 2లో బలంగా కమ్ బ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తాం, ఈ టీ20 ఫార్మాట్‌లో టాస్ గెలవడం చాలా ముఖ్యం. అప్పుడు అన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయి. తదుపరి మ్యాచ్‌లో మాకు అనుకూల ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నా’అని సంజూ చెప్పుకొచ్చాడు.కాగా.. ఈ మ్యాచ్‌లో 18 బంతుల్లో గుజరాత్ విజయానికి 34 పరుగులు అవసరమవ్వగా.. 18వ ఓవర్ వేసిన చాహల్ నాలుగు బంతులు సరిగ్గా వేసి ఐదో బంతికి సిక్స్ ఇచ్చి మొత్తం 11 పరుగులు సమర్పించుకున్నాడు. మెక్‌కాయ్ వేసిన 19వ ఓవర్‌లో బౌండరీ బాది క్విక్ సింగిల్‌తో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే రావడంతో ఆఖరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. ప్రసిధ్ వేసిన చివరి ఓవర్‌లో మిల్లర్ వరుసగా మూడు సిక్స్‌లు బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో చివరి ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 16 పరుగులు డిఫెండ్ చేయలేకపోయాడని రాజస్థాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రాజస్థాన్ ఓటమికి ప్రసిద్ధ్ కృష్ణనే కారణం అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. జోస్ బట్లర్(56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 89 పరుగులు)కు తోడుగా సంజూ శాంసన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47), దేవదత్ పడిక్కల్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) రాణించారు. గుజరాత్ బౌలర్లలో షమీ, యశ్ దయాల్, సాయి కిషోర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మిల్లర్‌కు తోడుగా హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 5 ఫోర్లతో 40 నాటౌట్), శుభ్‌మన్ గిల్(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35), మాథ్యూ వేడ్(30 బంతుల్లో 6 ఫోర్లతో 35) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఒబేడ్ మెక్‌కాయ్ తలో వికెట్ తీసారు.
ఇదీ చదవండి: Ravichandran Ashwin: తనని తాను ఎంఎస్ ధోని అనుకున్న అశ్విన్! పాపం పరాగ్..
BRB, stronger. 👊 pic.twitter.com/Ji27W8ksWP
— Rajasthan Royals (@rajasthanroyals) May 24, 2022