ఐపీఎల్ 2022లో గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో మహేంద్ర సింగ్ ధోనీ మేజిక్ చేశాడు. తనదైన స్టైల్‌లో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ కేవలం బ్యాటర్‌గా మాత్రమే పరిమితం కాలేదు. వికెట్ల వెనక ఉండి కథ నడిపించాడు. షాడో కెప్టెన్‌గా వ్యవహరించాడు. బిగ్ ఫిష్ కీరన్ పొలార్డ్ కోసం ధోనీ ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేశాడు. ఎనిమిది బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 14 పరుగులు చేసి.. ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్‌ను అవుట్ చేయడానికి ధోనీ ఫీల్డింగ్ సెట్ చేశాడు.
ఫీల్డింగ్ సెట్ చేసిన మరుసటి బంతికే అతను అవుట్ అయ్యాడు. ధోనీ అంచనాలు ఏ మాత్రం తప్పలేదు.. తప్పు కాలేదు. తాను ఫీల్డర్లను అలర్ట్ చేసిన ఆ తరువాతి బంతికి పొలార్డ్ పెవిలియన్ దారి పట్టాడు. 17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహీష్ తీక్షణ వేసిన ఓవర్‌లో తొలి బంతికి తిలక్ వర్మ సింగిల్ తీశాడు. పొలార్డ్ స్రై‍్టక్‌లోకి వచ్చాడు. ధోని వెంటనే స్ట్రెయిట్‌గా ముగ్గురు ఫీల్డర్లను మొహరించాడు. ఆఫ్ సైడ్ ప్లేయర్లను కాస్త దూరంగా వెళ్లాలంటూ సైగ చేశాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న ఫీల్డర్లనూ అలర్ట్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయాలంటూ సూచించాడు.తీక్షణ సంధించిన షార్ట్ లెంగ్త్ బంతిని పొలార్డ్ లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడాడు. అది కాస్త నేరుగా వెళ్లి శివం దూబే చేతుల్లో పడింది. అతను ఏ మాత్రం అటు ఇటు కదలకుండా ఉన్న చోటుకే బంతి వచ్చింది. శివమ్ దూబే కూడా దాన్ని అంతే నేర్పుగా ఒడిసిపట్టాడు. దీంతో పొలార్డ్ ధోని మాస్టర్ ప్లాన్‌కు బలై పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ధోనీ మాస్టర్ మైండ్‌ను నెటిజన్లు, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. మరి పొలార్డ్ కోసం ధోని సెట్ చేసిన ఫీల్డింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చివరి ఓవర్‌లో దుమ్ములేపిన ధోని! మరోసారి తనేంటో చూపించాడు
Field set by MS Dhoni, next ball Kieron Pollard out. pic.twitter.com/qmg00JFwMM
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2022
MS Dhoni set field and next ball Pollard out🔥
Wow wow wow😍..just too epic 🔥#Mahi🙏 #CSKvsMI #MIvsCSKpic.twitter.com/Ure8fCW9kU
— Riaaaaa (@riaa0riaa) April 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.