ఐపీఎల్ 2022లో భాగంగా 25వ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత పుంజుకున్న SRH తర్వాతి రెండు మ్యాచ్‌లలో మంచి విజయాలు సాధించింది. ఇప్పుడు మూడో గెలుపు కోసం సిద్ధమవుతోంది. ఇక కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఐదు మ్యాచ్‌లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరి ఈ రెండు జట్లలో ఏ జట్లు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే.. వారి బలాబలాలు పరిశీలిద్దాం..
కోల్‌కోత్తా నైట్ రైడర్స్..
ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో చాలా బలంగా ఉంది. ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లకు తోడు పేసర్ ఉమేష్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ప్యాట్ కమిన్స్ పరుగులు ఇస్తున్నా.. వికెట్లు తీసే సత్తా ఉంది. బ్యాటింగ్‌లో అజింక్యా రహానే కొంత ఇబ్బంది పడుతున్నాడు. వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. ఈ టీమ్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే ప్లేయర్ కూడా పెద్ద షాట్లు ఆడే వారు ఉన్నారు. ఆండ్రూ రస్సెల్ చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు రాబడతాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్..
చివరి రెండు మ్యాచ్‌లలో విజయాలతో మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న SRH.. పేపర్‌పై మాత్రం కేకేఆర్‌తో పోల్చుకుంటే కొంత బలహీనంగానే కనిపిస్తుంది. అయినా కూడా ఈ సీజన్‌లో ఓటమి ఎరుగని గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి రుచిచూపించడం SRH మైండ్‌సెట్‌ను మార్చినట్లు ఉంది. SRH బౌలింగ్ విభాగం బాగున్నా.. బ్యాటింగ్ కాస్త వీక్‌గానే ఉంది. విలియమ్సన్ రాణించకుంటే.. మొత్తం జట్టు కుప్పకూలే అవకాశం ఉంది.
పిచ్..
ఈ మ్యాచ్ ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
హెడ్ టూ హెడ్..
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు జరగ్గా.. 14 మ్యాచ్‌లలో కేకేఆర్, 7 మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ విజయం సాధించాయి. దీంతో సన్‌రైజర్స్‌పై కేకేఆర్ పైచేయిగా ఉంది.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించే అవకాశం ఉంది. కేకేఆర్ బౌలర్లు వాళ్ల స్థాయికి తగ్గట్లు రాణిస్తే.. విజయం ఖాయం. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
తుదిజట్ల అంచనా..
సన్‌రైజర్స్ హైదరాబాద్.. కేన్ విలియమ్సన్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, పూరన్, శషాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జన్‌సేన్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్
కోల్‌కతా నైట్ రైడర్స్.. శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి.
ఇదీ చదవండి: సచిన్‌కు పాదాభివందనం చేసిన జాంటీ రోడ్స్!
𝘛𝘢𝘪𝘺𝘢𝘢𝘳𝘪 𝘩𝘢𝘪 𝘱𝘰𝘰𝘳𝘪! Let’s go 👊#KKRHaiTaiyaar #SRHvKKR #IPL2022 pic.twitter.com/1ZIeF3AHdp
— KolkataKnightRiders (@KKRiders) April 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.