ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. గుజరాత్, రాజస్థాన్, లక్నో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ముంబై, చెన్నై లాంటి ఛాంపియన్లు టేబుల్ ఆఖరికే పరిమితమయ్యారు. ఇంక ఢిల్లీ విషయానికి వస్తే చేతులారా మ్యాచ్ ఓడిపోయి చివరికి ప్లే ఆఫ్స్ స్థానాన్ని బెగళూరుకు అప్పజెప్పారు. 2018లో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసిన ఢిల్లీ జట్టుపై.. ఈసారి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. టేబుల్ లాస్ట్ లో ఉన్న ముంబై జట్టు ఢిల్లీపై గెలిచి బెంగళూరును ప్లే ఆఫ్స్ కు పంపింది. అయితే ప్రస్తుతం ఈ విషయంపై రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
‘కెప్టెన్ గా తానేం చేస్తున్నదీ తెలియకుండా రిషబ్ పంత్ ప్రవర్తిస్తున్నాడు. ప్లే ఆఫ్స్ అవకాశాన్ని బంగారు పళ్లెంలో పెట్టి బెంగళూరు జట్టుకు అప్పగించారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు కెప్టెన్ ను నియమించేది. రెండు రివ్యూలు పెట్టుకుని టిమ్ డేవిడ్ క్యాచ్ అవుట్ ని డీఆర్‌ఎస్ తీసుకోకుండా పంత్ వ్యవహరించడం దారుణం. కెప్టెన్ గా అతను రివ్యూ తీసుకోకపోతే మిగిలిన జట్టు సభ్యులైనా చెప్పాల్సింది. వాళ్లు కూడా మాకెందుకులే అన్నట్లుగా వ్యవహరించారు. పంత్ కు బ్రెయిన్ దొబ్బింది.. అతను ఏం చేస్తున్నదీ తెలియకుండా ఉన్నాడు’ అంటూ రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
Rishabh Pant on Yesterday match’s DRS pic.twitter.com/CNjFVHd8rS
— RVCJ Media (@RVCJ_FB) May 22, 2022
ఇదీ చదవండి: RCBని ఒంటిచేత్తో ప్లే ఆఫ్స్ కు పంపిన ఈ టిమ్ డేవిడ్ ఎవరంటే?
జరింగిందేంటంటే.. 15వ ఓవర్లో బ్రెవిస్ ఔట్ కాగానే.. టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన బాల్ ను టిమ్ డేవిడ్ డిఫెండ్ చేసే క్రమంలో మిస్ అయ్యింది. ఆన్ ఫీల్డ్ లో అప్పీల్ చేశారు కానీ, అంపైర్ దానిని నాటౌట్ గా పరిగణించాడు. అటు బౌలర్ కూడా స్పందించలేదు.. వికెట్ల వెనకున్న కెప్టెన్ పంత్ అంతే ఉండిపోయాడు.
తీరా అల్ట్రా ఎడ్జ్ లో చూస్తే అది క్లియర్ అవుట్ సైడ్ ఎడ్ట్ తీసుకుంది. అప్పుడే కామెంటరీలో చెప్పుకొచ్చారు.. రివ్యూకి వెళ్లాల్సింది, టిమ్ డేవిడ్ ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టగలడు అని. కామెంటేటర్లు చెప్పినట్లుగానే తర్వాత టిమ్ డేవిడ్ అదే చేశాడు. టిమ్ 11 బంతుల్లో 34 పరులుగు కొట్టి ఢిల్లీని ఇంటికి పంపాడు. పంత్ పై రవిశాస్త్రి చేసిన ఘాటు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rishabh Pant wanted to review THAT appeal, but didn’t back his instinct #MIvDC | #IPL2022
👉 https://t.co/2QmPm76hEh pic.twitter.com/hWio62XSTs
— ESPNcricinfo (@ESPNcricinfo) May 21, 2022
rishabh pant to Delhi capitals for during last night match between #MIvsDC #RishabhPant #IPL #IPL2022 pic.twitter.com/wy172omI45
— memesadda21 (@memesadda21) May 22, 2022