ఈ మధ్య కాలంలో కొందరు యువతులు ప్రేమించిన ప్రియుడి కోసం ఎంతకైన తెగిస్తున్నారు. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలనే కోరికతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇక చివరికి అడ్డొచ్చిన తల్లిదండ్రులను సైతం హత్య చేసేందుకు వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కూతురు ప్రియుడి కోసం కన్న తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన యూపీ వ్యాప్తంగా తీవ్ర సంచనలంగా మారుతోంది. ఉత్తర్ ప్రదేశ్ మీడియా కథనం ప్రకారం.. అది ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లోని బుర్రా ప్రాంతం. ఇక్కడే మున్నాలాల్ ( రిటైర్డ్ ఉద్యోగి) (61), రాజ్ దేవి (55) దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు కూతురు కోమల్, కొడుకు అనూప్ లు సంతానం.
కొడుకు అనూప్ పెళ్లి గతంలోనే చేశారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో అనూప్ భార్య ఇటీవల భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. దీంతో అనూప్ భార్యతో విడాకులకు సిద్దమవుతున్నాడు. ఇక కూతురు కోమల్ విషయానికొస్తే.. కోమల్ స్థానికంగా ఉండే రోహిత్ అనే యువకుడితో గత కొంత కాలం నుంచి ప్రేమలో మునిగితేలుతుంది. కోమల్ కి మాత్రం ప్రియుడంటే ఎంతో ఇష్టం. కోమల్ ఇంట్లో కంటే ప్రియుడితోనే ఎక్కువగా గడిపేది. ఇక ఏదేమైనా సరే ప్రేమించిన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని కలలు కనేది. అయితే ఈ క్రమంలోనే మున్నాలాల్, రాజ్ దేవి దంపతులు కూతురు కోమల్ కి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీని కోసం సంబంధాలు కూడా చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కోమల్ షాక్ కు గురైంది. కానీ ఇక్కడే కూతురు కోమల్ కి ఓ దుర్మార్గమైన ఆలోచన పుట్టింది. నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నా తల్లిదండ్రులు ఎలాగైన ఒప్పుకోరు. అయితే ప్రియుడిని పెళ్లి చేసుకోవాలంటే తల్లిదండ్రులతో పాటు ఆమె సోదరుడిని చంపాలనే మాస్టర్ ప్లాన్ వేసింది. ఇక తల్లిదండ్రులను, సోదరుడు అనూప్ ను చంపితే ప్రియుడితో పాటు ఆస్తి కూడా దక్కుతుందని అనుకుంది. ఇక ఇదే విషయాన్ని ప్రియుడికి చేరవేసింది. ప్రియురాలి మాటను కాదనని ప్రియుడు రోహిత్ సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో పక్కా ప్లాన్ తో అడుగులు వేసిన కోమల్ జూలై 5న తల్లిదండ్రుల హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది.
ఇక అనుకున్నట్లుగానే జూలై 5న తెల్లవారుజామున కోమల్ ప్రియుడి రోహిత్ ఇద్దరూ ముసుగులు దరించి ఇంట్లోకి ప్రవేశించారు. ఇక ఇద్దరు కలిసి మొదటగా మున్నాలాల్, రాజ్ దేవి దంపతులను దారుణంగా హత్య చేశారు. ఇక అనంతరం కోమల్ సోదరుడిని సైతం హత్య చేయాలని చూశారు. కానీ అదృష్టవశాత్తూ అనూప్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అక్కడి నుంచి ప్రియుడు తప్పించుకోగ.. కోమల్ ఎప్పటిలాగే ఏం తెలియనట్లుగా ఇంట్లోనే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆ దంపతుల మృతదేహాలను పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమారుడు అనూప్ ను విచారించారు.
అయితే గత కొంత కాలం నుంచి తన భార్యతో విభేదాలు ఉన్నాయి. విడాకులు కూడా తీసుకోవాలనుకున్నాం. దీంతో అది నచ్చక నా భార్ సోదరులే నా తల్లిదండ్రులను హత్య చేసి ఉంటారని అనూప్ అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో అనూప్ భార్య సోదరులను విచారించగా మాకేం సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇక ఎలాంటి సాక్ష్యాలు దొరకకపోవడంతో చివరిగా ఆ దంపతుల కుమార్తె కోమల్ ను పోలీసులు విచారించారు. కానీ కోమల్ పొంతనలేని సమాధానాలు తెలిపింది. ఇక్కడే ఆ యువతిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తూనే కోమల్ ను విచారించారు.
చివరికి పోలీసుల స్టైల్ లో విచారించే సరికి కోమల్ అసలు విషయాలు బయట పెట్టింది. నా ప్రియుడిని, మా తల్లిదండ్రుల ఆస్తిని దక్కించుకునేందుకే నా తల్లిదండ్రులను నా ప్రియుడితో కలిసి చంపానని తెలిపింది. ఇక నా సోదరుడిని కూడా చంపాలని చూశాము కానీ.. అతడు అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు. అయితే మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాలకు మాస్కలు దరించినట్లుగా కూడా కోమల్ తెలిపింది. అనంతరం యువతి కోమల్, ఆమె ప్రియుడు రోహిత్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ జైలుకు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన యూపీ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది.