అక్రమ సంబంధం.. ఇదే సాఫీగా సాగుతున్న వైవాహిక దంపతుల జీవితాన్ని రోడ్డున పడేలా చేస్తోంది. తాళికట్టిన భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఎవరికి వారే వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతూ చివరికి వారి జీవితాల్లో విషాదం నింపుకుంటున్నారు. వీటి ప్రభావం కారణంగా హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలాగే తాళికట్టిన భర్తను కాదని ఓ భార్య పక్కింటి కుర్రాడితో లేచిపోయింది. దీనిని జీర్ణించుకోలేని ఆ భర్త అందరినీ షాక్ కు గురిచేస్తూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ పరిధిలోని కసన్. ఇదే గ్రామంలో కవిందర్, రీనా అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. చాన్నాళ్ల కిందటే వీరికి పెళ్లైంది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు సంతోషమైన కాపురాన్ని నెట్టుకొస్తున్నారు. భర్త స్థానికంగా క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా వీరి వైవాహిక జీవితం గడుస్తున్న క్రమంలోనే భార్య రీనా పక్కచూపులు చూసింది. ఏకంగా పక్కింటి కుర్రాడు రామ్ వీర్ తో అక్రమ సంబంధాన్ని పెటుకుని భర్తకు పంగనామాలు పెట్టింది.
ఇది కూడా చదవండి: ట్యాక్సీ డ్రైవర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.. కానీ ఈ పొరపాటే ఆమెను నిండాముంచింది!
గ్రామంలో తన పరువు తీసిన భార్య తీరుపై బాధపడ్డ భర్త కవిందర్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కవిందర్ కుటుంభికులు శోక సంద్రంలో మునిగిపోయారు. అన్న బలవన్మరణంపై స్పందించిన కవిందర్ తమ్ముడు సంతోష్ కుమార్ రీనాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రీనా, రామ్ వీర్ పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.