నేటి కాలంలో కొందరు వ్యక్తులు యువతులను నమ్మించి ప్రేమ పేరుతో కోరికలు తీర్చుకుని చివరికి కాదు పొమ్మంటున్నారు. ఇక మరి కొందరైతే పెళ్లి చేసుకున్న ఏడాదికో, మరో ఏడిదికో వారి అసలు రూపాన్ని బయటపెడుతు దారుణాలకు పాల్పడుతున్నారు. భార్యకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకోవడం, దీంతో కట్టుకున్న భార్యను పట్టించుకోకపోవడం లేదా వరకట్నం పేరుతో తీవ్ర హింసకు గురి చేయడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి వేధింపులను భరించలేకపోయిన ఓ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నెలమంగల, మాదనాయకనహళ్లి పరిధిలోని గంగొండనహళ్లి. ఇదే ప్రాంతంలో అనిత అనే మహిళ ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పని చేస్తుంది. తాను ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే అనితకు కంపెనీలో ట్యాక్సీ డ్రైవర్ అయిన ప్రదీప్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే ఆ యువకుడు అనితతో కాస్త చనువుగా ఉండేందుకు ప్రయత్నించేవాడు. మెల్ల మెల్లగా అనిత కూడా అతని ముగ్గులోకి దిగిపోయింది.
ఇది కూడా చదవండి: ఆలయానికి పూజల కోసం వచ్చిన మహిళలను వశీకరణతో లొంగదీసుకుంటున్న పూజారి!
అలా కొన్ని రోజులు గడిచిందో లేదో అప్పటికే వీరిద్దరూ ప్రేమ పేరుతో దగ్గరయ్యారు. దీంతో వీరిద్దరు కొంత కాలం ప్రేమించుకుని ప్రేమ విహారంలో తేలియారు. ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకోవడంతో చివరికి పెళ్లి కూడా చేసుకున్నారు. అలా పెళ్లైన ఆరు నెలల వరకూ వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ రోజుల గడిచే కొద్ది అనిత భర్త ప్రదీప్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టేశాడు. అదనపు కట్నం తేవాలంటూ ప్రదీప్ అనితను రోజూ వేధింపులకు గురి చేసేవాడు. అలా కొంత కాలం పాటు భర్త వేధింపులను భరించిన అనిత చివరికి అతనితో కలిసి ఉండకూడదనే అభిప్రాయానికి వచ్చింది.
ఇందులో భాగంగానే అనిత ఇటీవల విడాకులకు సైతం కోర్టులో కేసు వేసింది. అయితే కోర్టు గురువారం తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే అనిత బుధవారం జీవితంపై విరక్తి చెందింది. ఇలాంటి బతుకు వద్దనకుని అదే రోజు రాత్రి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు వదిలింది. గురువారం కోర్టు తీర్పు ఉండడం, ముందు రోజే అనిత బలవన్మరణానికి పాల్పడడంతో అనిత కుటుంభికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.