ఈమధ్యకాలంలో చాలామందిలో సహనం అనేది లోపిస్తుంది. దీంతో ప్రతి చిన్న విషయానికి త్వరగా రియాక్ట్ అవుతుంటారు. మాటకు మాట పెరిగినప్పుడు క్షణం పాటు ప్రశాంతంగా ఉంటే ఆ తరువాత జరిగి చెడు పరిణామాలను ఆపవచ్చు. అయితే మనిషిలోని గర్వం, అహకారం వంటివి లోపల ఉంటే మంచి మనిషి చంపేసి.. ఎదుటి వ్యక్తితో యుద్ధానికి ప్రేరేపిస్తుంది. అది కాస్తా మనిషి హత్య చేసేందుకు దారితీస్తుంది. తాజాగా సెలూన్ షాపులో గడ్డం విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం ఇద్దరి హత్యకు దారితీసింది. ఈ ఘటన గురువారం రాత్రి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీపంలో బోధి గ్రామంలో అనిల్ మారుతి శిందే అనే వ్యక్తి సెలూన్ షాపు నడుపుతున్నాడు. మారుతి షాపుకి వెంకట్ సురేష్ దేవ్ కర్(22) అనే వ్యక్తి షేవింగ్ కోసం వెళ్లాడు. ఈ క్రమంలో అనిల్ మారుతి సగం గడ్డం గీశాక.. వెంకట్ ను డబ్బులు అడిగాడు. పూర్తయ్యాక ఇస్తానని వెంకట్ చెప్పాడు. అయితే దానికి మారుతి ససేమిరా అన్నాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. అనిల్ మారుతి విచక్షణ కోల్పోయి తన దుకాణంలో అందుబాటులో ఉన్న పదునైన ఆయుధంతో వెంకట్ గొంతు కోశాడు. దీంతో అక్కడికక్కడే వెంకట్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి బంధువులు తీవ్ర ఆగ్రహంతో సెలూను సెలూను తగులబెట్టారు. అంతటితో ఆగక అనిల్ మారుతిని వెదికి పట్టుకొని.. గ్రామంలోని మార్కెట్ వద్ద కొట్టి చంపారు. అనంతరం అతడి ఇంటిని కూడా తగులబెట్టారు. చిన్నపాటి వివాదం, రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి