ఆమె గర్భిణి. కానీ వాళ్లు అస్సలు కనికరం చూపించలేదు. నాన్న లోన్ విషయంలో న్యాయం అడిగినందుకు ఘోరమైన పనిచేశారు. ఏకంగా ట్రాక్టరుతో తొక్కించేశారు. దీంతో ఆ మహిళ ప్రాణాలు విడిచింది. ఈ విషయం ఆ ఊరివాళ్ల కోపానికి కారణమైంది. దీంతోపాటు మరికొందరు కూడా వీళ్లతో కలిశారు. అందరూ కలిసి సదరు ఫైనాన్స్ కంపెనీని చుట్టుముట్టారు. ఆ మహిళ చావుకి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సదరు రైతు కుటుంబానికి పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్ ఇచాక్ గ్రామానికి చెందిన మిథిలేష్ మెహతా దివ్యాంగ రైతు. 2018లో మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. కొవిడ్ సమయంలో ఇబ్బందుల వల్ల ఆరు ఈఎమ్ఐలు కట్టలేకపోయాడు. దీంతో సదరు కంపెనీ వాళ్లు.. మిథిలేష్ కు నోటీసులు పంపారు. వడ్డీతో కలిసి రూ.13 లక్షల మొత్తాన్ని కట్టాలని అందులో పేర్కొన్నారు. సెప్టెంబరు 13న రూ.12 లక్షలు తీసుకుని ఫైనాన్స్ కంపెనీకి వెళ్లిన రైతు మిథిలేష్ కు వింత అనుభవం ఎదురైంది. రూ.13 లక్షలు కడితేనే కుదురుతుందని, లేదంటే ట్రాక్టర్ ని జప్తు చేసుకుంటామని వాళ్లు ఖరాఖండీగా చెప్పేశారు.
ఇక చేసేదేం లేక ఆ మొత్తాన్ని కూడబెట్టిన మిథిలేష్ సెప్టెంబరు 15న లోన్ కట్టేయాలని అనుకున్నాడు. కానీ లోన్ రికవరీ ఏజెంట్స్ మాత్రం మిథిలేష్ మాటలు పట్టించుకోకుండా ట్రాక్టర్ తీసుకునిపోయారు. బంకులో పెట్రోల్ నింపుతుండగా.. మిథిలేష్ తన మూడునెలల గర్భంతో ఉన్న కుమార్తెతో అక్కడికి చేరుకున్నాడు. డబ్బు కట్టేస్తానన్నా సరే సదరు ఏజెంట్స్ వినలేదు. వాళ్లతో పాటే ఉన్న జోనల్ మేనేజర్ ని.. మిథిలేష్ కుమార్తె ఐడెంటిటీ ప్రూప్ చూపించమని అడిగింది. దీంతో కోపం తెచ్చుకున్న సదరు మేనేజర్.. ట్రాక్టర్ ని ఆమెని తొక్కించేయమని చెప్పాడు. ఈ క్రమంలో ఆమె తీవ్రగాయాలపాలై, ఆస్పత్రిలో కన్నుమూసింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం లోన్ రికవరీ ఏజెంట్స్ ఫోన్స్ సిచ్ఛాఫ్ వస్తున్నాయి. మరి గర్భిణిని ట్రాక్టర్ తో తొక్కి చంపడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: రూ.500 కోసం ప్రియుడి ప్రాణాలు తీసిన ప్రియురాలు!