ఆడపిల్లలు ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెడతారు. చాలా మంది అమ్మాయిలు తమ అత్తమామలు, భర్తతో కలసి ఎంతో సంతోషంగా జీవిస్తుంటారు. అయితే కొన్ని కుటుంబాల్లో మాత్రం ఆడపిల్లలు వేధింపులకు గురవుతుంటారు. ఈ క్రమంలో కొందరు యువతలు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ వివాహిత.. కూలీ పనులకు వెళ్లి.. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు షాకిచ్చింది.
ఆడపిల్లలు ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెడతారు. చాలా మంది అమ్మాయిలు తమ అత్తమామలు, భర్తతో కలసి ఎంతో సంతోషంగా జీవిస్తుంటారు. అయితే కొన్ని కుటుంబాల్లో మాత్రం గొడవలు జరుగుతుంటాయి. అలానే కొందరు అత్తింటి వారు ఆడపిల్లలను వరకట్న వేధింపులకు గురి చేస్తుంటారు. అంతేకాక ఈ వేధింపుల కారణంగా కొందరు ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు అనుమానస్పదస్థితిలో మరణిస్తున్నారు. భర్తతో కలసి తమ కూతురు సంతోషంగా ఉంటుందని భావించే తల్లిదండ్రులకు వారి కుమార్తె మరణం తీవ్ర వేదన గురి చేస్తోంది. రెండు రోజుల క్రితం పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చిన ఓ వివాహిత.. ఆదివారం సాయంత్రం అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్నెల తండాకు చెందిన ప్రవీణ్ కుమార్ నాయక్ కు ఎనిమిది నెలల క్రితం చిత్తూరు జిల్లా కుప్పం మండలం వీర్నమల తండాకు చెందిన నందిని(20) అనే యువతితో వివాహం జరిగింది. తమ కుమార్తెకు పెళ్లి చేసిన సంతోషంలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. అప్పుడప్పుడు కూతురు, అల్లుడు ఇంటికి వస్తూ వెళ్తుంటే ఆ యువతి తల్లిదండ్రులు సంతోషించే వారు. అలానే వారం క్రితం కూడా నందిని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపింది. కుటుంబ సభ్యులతో ఉండటంతో వారం రోజులు కూడా ఆమె ఒక్కరోజులాగా గడిచిపోయాయి. ఇక రెండు రోజుల క్రితమే నందిని పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చింది.
నందినీ భర్త ప్రవీణ్ కుమార్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలానే ఆదివారం కూడా కూలీ పనుల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా అనుమానస్పద స్థితి ఉరికి వేలాడుతూ నందిని కనిపించింది. ఉరికి వేలాడుతూ కనిపించిన భార్యను చూసి.. ప్రవీణ్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడి చేరుకున్నారు. ఆమెను పరీశిలించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడి ప్రాంతాన్ని పరిశీలించి.. వివరాలను సేకరించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
నందిని ఆత్మహత్య చేసుకున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అదనపు కట్నం తేవాలని భర్త, అత్తింటి వారు వేధించేవారని ఈ నేపథ్యంలో వారని, అందుకే వారం క్రితం నందిని స్వగ్రామానికి వెళ్లి వచ్చిందని మృతురాలి పెద్దమ్మ తెలిపారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కారణాలు ఏమైనప్పటికి… కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ యువతికి.. అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.