నేటికాలంలో కొందరు యువత ప్రతి చిన్న విషయానికి ఆవేశానికి లోనవుతున్నారు. తల్లిదండ్రులు కొట్టారని, పక్కింటి వారు తిట్టారని, స్నేహితులు ఎగతాళి చేశారని కొందరు తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారు. ఈక్రమంలో ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఇలా తమ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఏలూరు నగరానికి చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దొంతనానినికి వచ్చావంటూ పక్కింటి వారు దాడి చేయడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఏలూరు నగరానికి చెందిన కర్నాటి కోమలేశ్వరి (17).. పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కోమలేశ్వరి తండ్రి గతంలోనే మృతి చెందటంతో తల్లి పద్మావతే కుటుంబాన్ని పోషిస్తోంది. సెప్టెంబర్ 25న పక్కింట్లో ఉన్న కుక్క పిల్లలను చూసేందుకు కోమల్లేశ్వరి వెళ్ళింది. అయితే ఆ ఇంట్లోని వారు ఆమెను.. దొంగతనం చేసేందుకు వచ్చావా? అంటూ దాడి చేశారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అదే రోజు ఆ యువతి పెదవేగి మండలం రాట్నాలకుంటలో ఉంటున్న నాన్నమ్మ వెంకట రమణ ఇంటికి వెళ్లింది. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు గమనించి కోమలేశ్వరిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే వైద్యుల సూచనలతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 8వ తేదీ రాత్రి ఆమె మరణించింది.ఈ ఘటనపై ఏలూరు త్రీ టౌన్ సీఐ ప్రసాదరావు మాట్లాడుతూ.. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుక్క పిల్లలను చూడటానికి వెళ్లిన.. తమ కూతురిపై దొంగతనం అంటగట్టి పక్కింటి వారు దాడి చేశారని, ఆ మనస్తాపంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు ఫిర్యాదులో మృతురాలి తల్లి పేర్కొంది.