ఈ రోజుల్లో ఆడదానికి పూర్తిగా రక్షణ లేకుండా పోయింది. అందమైన అమ్మాయి రోడ్డు మీద కనిపిస్తే చాలు.., కొందరు దుర్మార్దులు విర్రవీగి ప్రవర్తిస్తున్నారు. ప్రేమించాలని వెంటపడడం, కాదంటే హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారు. గట్టిగా చెప్పాలంటే.. అమ్మాయిలకు ఇంట్లోనే రక్షణ లేకుండా పోతుంది. కన్న పిల్లల పట్ల కొందరు తల్లిదండ్రులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయి. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ తండ్రి కన్న కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు మధురైలోని జైహిందుపురం ప్రాంతం.
ఇక్కడే కాళిముత్తు, ప్రియదర్శని అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భర్త టైలరింగ్ పని చేస్తుండగా, భార్య స్థానికంగా ఓ షాప్ లో సేల్స్ గర్ల్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే వివాహం జరిగిన కొంత కాలానికి వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. ఆ కూతురు పెరిగి 8 ఏళ్ల వయసుకు వచ్చింది. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది. కానీ భార్య ప్రియదర్శిని బయటకు వెళ్లి ఉద్యోగం చేసి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుండడంతో భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. కాళిముత్తు చాలా సార్లు భార్యను.. నీకు మరో మగాడితో అక్రమ సంబంధం ఉందంటూ నిందలు మోపేవాడు.
భార్య మాత్రం భర్త మాటలు విని విననట్లుగా వదిలేసేది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్తకు ఏం చేయాలో అర్థం కాలేదు. అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్లు భార్యపై కోపాన్ని భర్త తన 8 ఏళ్ల కూతురిపై తీర్చుకున్నాడు. అది సెప్టెంబర్ 23. కాళిముత్తు ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చింది. రోజులు గడుస్తున్నకొద్ది ఆ దుర్వాసన మరింత ఎక్కువైంది. ఇక ఎందుకో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. బకెట్ లో కాళిముత్తు 8 ఏళ్ల కూతురి మృతదేహాన్ని కనిపించింది.
దీంతో షాక్ తిన్న పోలీసులు తండ్రి కాళిముత్తును విచారించగా.. నా భార్య పరాయి మగాడితో అక్రమ సంబంధంగా పెట్టుకుందని, ఈ అనుమానంతోనే భార్యపై కోపంతో నా కూతురిని చంపి కాళ్లు, చేతులు విరిచేసి బకెట్ లో కుక్కాను. అనంతరం నేను ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నా.. కానీ ధైర్యం లేకపోవడంతో అక్కడిక్కడ తిరుగుతున్నానని చెప్పాడు. నిందితుడు వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి కాళిముత్తుని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.