ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల వలన అనేక ఘోరాలు జరుగుతున్నాయి. పరాయి వారి మోజులో పడి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. భాగస్వామికి తెలియకుండా పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని భాగస్వామిని, కన్న బిడ్డలను హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా వివాహేతర సంబంధానికి మరొకరు బలయ్యారు.
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల వలన అనేక ఘోరాలు జరుగుతున్నాయి. పరాయి వారి మోజులో పడి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. భాగస్వామికి తెలియకుండా పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. చివరకు వారి చీకటి క్రీడాలు బయటపడటంతో దారుణాలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని భాగస్వామిని, కన్న బిడ్డలను హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ముఖ్యంగా ఇలాంటి దారుణాలకు మహిళలే ఎక్కువగా పాల్పడటం గమన్హారం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో భార్య.. తన భర్తను హత్య చేయించింది. 225రోజులకు మృతుడి అస్థిపంజరం బయట పడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లా తుంగపాడు గ్రామానికి చెందిన రాగ్యానాయక్(28)కి పెద్దవూరుకు చెందిన రోజాతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రాగ్యా నాయక్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ మణికొండలో నివాసం ఉంటున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎల్లమ తండాల్లో అతడి తోడల్లుడు లక్ పతి నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో రోజాకు రాగ్యానాయక్ తోడల్లుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ అక్రమ సంబంధం కారణంగా రోజూ రోజా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి.
ఈక్రమంలో లక్ పతి నాయక్ తో రాగ్యానాయక్ గొడవ పడ్డాడు. తోడల్లుడు రోజా భర్తను చంపుతానని బెదిరించాడు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఒకరోజు రాగ్యానాయక్ స్థలాన్ని లక్ పతి నాయక్ కొనుగోలు చేశాడు. ఈక్రమంలో రూ.3 లక్షలు రాగ్యానాయక్ కి అతడు బాకీ ఉన్నాడు. గత ఏడాది ఆగస్టు 19న బొంగులూర్ గేట్ వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని రాగ్యానాయక్‌ను లక్ పతి పిలిపించుకున్నాడు. అక్కడి వెళ్లిన తరువాత దేవరకొండలో డబ్బులు రావాల్సి ఉందని చెప్పి కారులో తీసుకెళ్లాడు.
లక్‌పతితో పాటు అతని స్నేహితులు రాగ్యానాయక్ కు మద్యం తాగించి నేరుడుగొమ్మ మండలం, బుగ్గతండా వద్ద కాళ్లు, చేతులు కట్టేసి..శరీరాని ఐరన్ రాడ్లు కట్టాడు. అనంతరం చేపల వలలో చుట్టి, పడవలో తీసుకెళ్లి కృష్ణా నది మధ్యలో పడేశారు. ఆ తరువాత ఎవరి ఇంటికి వాళ్లు వచ్చేశారు. ఇదే సమయంలో తన భర్త నాలుగు రోజులుగా కనిపించడం లేదని, ఫోన్ చేసిన పనిచేయడం లేదని అతడి భార్య రోజా రాయదుర్గం పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు రోజా ప్రవర్తనపై అనుమానం కలిగింది.
అటుగా విచారణ చేపట్టగా తన బావతో ఉన్న వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా రాగ్యానాయక్‌ను హత్య చేసినట్లు లక్ పతి ఒప్పుకున్నాడు. నిందితులిద్దరినీ పోలీసులు రిమాండ్ కు తరలించారు. కృష్ణానదిలో బ్యాక్ వాటర్ తగ్గడంతో 225 రోజుల తర్వాత చేపల వలలో చుట్టి ఉన్న అస్థి పంజరాన్ని గుర్తించిన తుంగపాడు, లావు తండా వాసులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు ఘటనల స్థలానికి వచ్చి.. అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.