మనం తీసుకునే నిర్ణయాలే.. మన జీవితాలను నిర్ణయిస్తాయి. ఒక ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే, ఎవరిని నమ్మాలో అర్ధం కాకపోతే, న్యాయం కోసం ఎవరిని ఆర్జించాలో అర్ధం కాకపోతే ఇక చదివిన చదువుకి అర్ధం ఏముంటుంది? ఈ విషయాల్లో క్లారిటీ లేకనే.. ఇప్పుడు ఒక యువతి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ముగ్గురు మగాళ్ల జీవితాలను ఛిద్రం చేసింది. మరో నీచుడి చావుకి కారణం అయ్యింది. సినిమాని తలపించే ఈ ఘటన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చెన్నై నగరానికి చెందిన వికాస్ ఓ అందమైన కుర్రాడు. డాక్టర్ చదివింది ఉక్రెయిన్‌లో అయినా.. డాక్టర్ గా చెన్నైలోనే స్థిరపడ్డాడు. పెద్ద కుటుంబం.. పైగా తెలివైన కుర్రాడు. ఇతనికి రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో ప్రతిభ పరిచయం అయ్యింది. ఇద్దరు మనసు ఇచ్చి పుచ్చుకున్నారు. తెలియకుండానే ఒక్కటైపోయారు. తరువాత ప్రతిభ కోసమే వికాస్ బెంగుళూరుకి కూడా షిఫ్ట్ అయ్యాడు. ఇద్దరూ గాఢమైన ప్రేమలో మునిగిపోయారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దల వరకు చేరింది. పిల్లల ఇష్టాన్ని కాదనలేకపోయిన తల్లిదండ్రులు పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశారు. దీనితో.. వికాస్- ప్రతిభ ఫుల్ హ్యాపీ. రాబోయే నవంబర్ లో పెళ్లి ఫిక్స్ అయ్యింది.
నెలలో పెళ్లి కాబోతుండటంతో వికాస్ ని ప్రతిభ పూర్తిగా నమ్మేసింది. తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు వికాస్ కి పంపిస్తూ ఉండేది. ఈ విషయంలో వికాస్ నుండి తీవ్ర ఒత్తిడి ఉండేది. ఈ కారణంగానే ప్రతిభ కాస్త గీత దాటింది. కానీ.., వికాస్ ఇక్కడే చాలా క్రూరంగా ఆలోచించాడు. తనని నమ్మిన అమ్మాయి, తనకి కాబోయే భార్య అని కూడా చూడకుండా.. ప్రతిభ ప్రైవేట్ వీడియోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అలా.. అప్లోడ్ చేసి, ఆ లింక్స్ స్నేహితులకి పంపుతూ రాక్షస ఆనందం పొందటం మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ప్రతిభ తల్లడిల్లిపోయింది. ప్రేమించిన పాపానికి ఇంత శిక్ష వేస్తాడా? నేను ఏ తప్పు చేశాను? ఇందుకు నన్ను ఇంత మోసం చేశాడు అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. విషయం పెద్దల వరకు వెళ్లడంతో వికాస్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకా ఈ విషయం పెద్దది చేసుకుంటే అమ్మాయి పరువు పొద్దని వికాస్ ని మందలించి వదిలేశారు. కానీ.., అదే ప్రతిభ తల్లిదండ్రులు చేసిన తప్పు అయ్యింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిభ అందరిలా సులభంగా మర్చిపోలేకపోయింది. తనని ఇంత దారుణంగా మోసం చేసిన వికాస్ కి తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంది. ఈ విషయంలోనే నిత్యం ఆలోచిస్తూ.. ఆఫీస్ లో కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉండేది. ఇక ప్రతిభ బాధ చూడలేక.. ప్రతిభ కొలీగ్స్ సుశీల్, గౌతమ్, సూర్య ఆమెకి సాయం చేయడానికి ముందుకి వచ్చారు. అంతా కలిసి వికాస్ కి దేహశుద్ది చేయాలని నిర్ణయించుకున్నారు. వీరంతా వారం రోజుల క్రితం వికాస్ గదికి వెళ్లి అతన్ని తీవ్రంగా కొట్టారు. ప్రతిభ అయితే.. దొరికిన ప్రతి వస్తువు తీసుకుని వికాస్ తలపై బాధేసింది. ఆ దెబ్బలకి వికాస్ అక్కడే కుప్పకూలిపోయాడు. వికాస్ ని ఆ కొట్టిన వాళ్ళే.. తరువాత అతన్ని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ రోజు నుండి కోమాలో ఉన్న బాధితుడు ఈ ఆదివారం రాత్రి చనిపోయాడు.
విషయం తెలుసుకున్న బెంగుళూరు పొలీసులు కేసు నమోదు చేసుకుని ప్రతిభతో పాటు.. ఆమె స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. మరో స్నేహితుడు సూర్య మాత్రం పరారీలో ఉన్నాడు. చూశారు కదా.. ఎంతో ఉన్నతమైన కుటుంబంకి చెందిన ప్రతిభ తనకి తెలియకుండానే ఇలా దోషిగా మారాల్సి వచ్చింది. ఓ నీచుడు కారణంగా ఆమె బాధని అనుభవించిన మాట వాస్తవమే. కానీ.., చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతిభ కూడా దోషిగా మారింది. ఆమెతో పాటు.., ఆమె ముగ్గురు స్నేహితుల జీవితాలు కూడా నాశనం అయ్యాయి. మరి.. ఈ మొత్తం ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.