నేటికాలంలో మనిషిలోని మానవత్వం, మంచితనం కనుమరుగై పోతున్నాయి. అంతే కాక ప్రతి చిన్న విషయానికి యుగోలకు పోయి సాటి మనిషిపై పగలు, ప్రతీకారాలు పెంచుకుంటున్నారు. ఇవి కాస్తా దాడులకు, హత్యలకు దారి తీసుకున్నాయి. అలా ఒకరు మరణిస్తే మరోకరు జైలు పాలై.. బ్రతికున్న జీవచ్ఛవంగా ఉంటున్నారు. తాజాగా ఇద్దరు మహిళల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ బలితీసుకుంది.. మరొకరిని కటకటాల వెనక్కి పంపింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా హుళియారు పోలీస్ స్టేషన్ లో సుధ, రాణి అనే ఇద్దరు మహిళలు కానిస్టేబుల్ గా పనిచేస్తోన్నారు. అయితే వారిద్దరి మధ్య అంత సఖ్యత ఉండేది కాదు. దీంతో డ్యూటీ విషయంలో తరచూ గొడవ పడేవారు. ఇదే సమయంలో వారి మధ్య డబ్బుల విషయంలో కూడా వాగ్వాదం జరిగేది. వారిద్దరు మూడు,నాలుగు సార్లు స్టేషన్ లోనే భౌతిక దాడులకు కూడా దిగబోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎలాగైన సుధను చంపేయాలని రాణి ప్లాన్ వేసింది. అందుకు ఏకంగా సుధకు సోదరుడి వరుసైన మంజునాథ్ కు సుపారీ ఇచ్చింది.
సుధను హత్య చేసేందుకు సుపారీ తీసుకున్న మంజునాథ్(23), తన స్నేహితుడు నిఖేశ్ సాయం తీసుకుని సుధను కారులో హాసన్ తీసుకెళ్లాడు. అక్కడ సుధను హత్య చేసి పొదల్లో పడేసి తిరిగి కారులో వెళ్లిపోయాడు. అయితే ఈ హత్య గురించి మంజునాథ్ తీవ్రంగా భయాందోళన చెందాడు. దీంతో శివమొగ్గకు చేరుకున్న మంజునాథ్ అక్కడ ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరి… ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.