పిల్లలపై తల్లికి ఉన్న ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. వారి కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. ఇక కుటుంబ సభ్యులు తనని ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన భరిస్తుంది.. కానీ తన బిడ్డలకు చిన్నపాటి హాని తలపెట్టిన ఊరుకోదు. అలా తన బిడ్డలనకు ఎవరైన హాని తలపెడితే అపరకాళికాల మారి.. వారి అంతుచూస్తుంది. పిల్లల్ని హత్య చేశాడని కోపంతో రగిలిపోయిన ఓ మహిళ తన భర్తను గొంతు కోసి చంపేసేంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్లకు చెందిన ఓంకార్(40), మహేశ్వరి భార్యాభర్తలు. పెళ్లైన నాటి నుంచి కొన్నేళ్ల పాటు వీరి సంసారం హాయిగా సాగింది. వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు చందన(3), కొడుకు విశ్వనాథ్(1) పుట్టారు. బాబు పుట్టాక మూడో సంతానం కావాలని ఓంకార్.. మహేశ్వరిని అడుగుతున్నాడు. దీనికి ఆమె ఒప్పుకోవడంలేదు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉన్న ఇద్దరు పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేస్తే చాలని వాదిస్తోంది. చివరకు ఇటీవల భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని ఓంకార్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆగష్టు 17న భార్య, తన ఇద్దరు పిల్లలను తీసుకుని బైక్ పై ఆస్పత్రికి బయల్దేరాడు. మార్గం మధ్యంలో పెద్ద కొత్తపల్లి మండలం గంట్రావుపల్లి సమీపంలో రాగానే భార్యను బండిపై నుంచి తోసేశాడు. అనంతరం ఇద్దరు చిన్నారులను తీసుకొని వెళ్లిపోయాడు.
కోడేరు మండలం నాగుపల్లి సమీపంలోని అడ్డగట్టు పైకి పిల్లలను తీసుకెళ్లి.. అక్కడ వారిద్దరి గొంతుకోశాడు. అనంతరం తాను గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా ఓంకార్ ప్రాణాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో ఓంకార్ చికిత్స పొందాడు. డిశ్చార్జ్ అయిన అనంతరం ఇంటికి వెళ్లాడు. అప్పటికే భర్త ఓంకార్ పై మహేశ్వరి కోపంతో రగిలిపోతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన తల్లి జోగమ్మతో కలిసి తన బిడ్డలను భర్త ఎలా చంపాడో.. అదే విధంగా గొంతు కోసి చంపేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.