ప్రస్తుత కాలంలో సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. మద్యపానం, మాదకద్రవ్యాల వంటి దురలవాట్ల వల్లనేకాక.. వివాహేతర సంబంధం కారణంగా కూడా నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రియుడి కోసం.. భర్త, కాబోయే వాడు.. పిల్లలను కూడా బలి తీసుకుంటున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిలో మహిళలు కూడా ఉండటం విచారకర అంశం. మరికొందరు ప్రియుడితో బతకడం కోసం కుటుంబాన్ని వదిలిపోతున్నారు.. కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పదేళ్ల క్రితం వివాహిమైన ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ మూడేళ్ల క్రితం పరిచయమైన ప్రియుడి కోసం దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ, ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన ఉప్పునూతల గంగరాజుకు.. పదేళ్ల క్రితం మోతె మండలం.. సిరికొండ గ్రామానికి చెందిన లావణ్యతో పెళ్లి జరిగింది. ఈ దంపతులుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. బంగారం లాంటి భర్త, పండంటి పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో.. మూడేళ్ల క్రితం వచ్చిన వ్యక్తి కారణంగా పూర్తిగా మారిపోయింది.
మూడేళ్ల క్రితం లావణ్యకు.. అగే గ్రామానికి చెందిన చింతపల్లి మహేశ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త పెరిగి.. వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం కాస్త.. ఇరువురు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీని గురించి వారు లావణ్య, మహేశ్‌లను మందలించారు. దాంతో మనస్థాపానికి గురైన వీరిద్దరూ.. ఆదివారం తమ ఇళ్లను విడిచి వెళ్లిపోయారు. రాత్రి అయినా సరే.. లావణ్య.. ఇంటికి రాలేదు. దాంతో ఆందోళన చెందిన లావణ్య భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో పోలీసులు.. ఫోన్ లోకేషన్ ఆధారంగా.. గ్రామంలో కౌలు రైతు.. సోమిరెడ్డి మాధవరెడ్డి అనే వ్యక్తి పొలం వద్ద.. మహేశ్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి.. పరిశీలించగా.. అప్పటికే లావణ్య, మహేశ్‌లు ఇద్దరూ మృతి చెందినట్లు.. గుర్తించారు. వారి మృతదేహాల పక్కన మందు డబ్బాలు ఉండటంతో.. ఆత్మహత్యకు పాల్పడినట్లు.. పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం.. ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి మూడేళ్ల క్రితం తన జీవితంలోకి వచ్చిన వాడి కోసం.. పిల్లలను కూడా వదులుకుని.. ప్రాణాలు తీసుకున్న.. లావణ్య నిర్ణయం సరైందేనని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.