ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు పెళ్లై పిల్లలున్నా కూడా పరాయి మగాడి కోసం ఆరాటపడుతున్నారు. భర్త చాలదన్నట్లుగా ప్రియుడి మోజులో పడి క్షణిక సుఖం అడ్డదారుల్లో అడుగులేస్తున్నారు. ఇలా తన వక్రబుద్దిని చూపిస్తూ వివాహేతర సంబంధానికి ఎవరు అడ్డొచ్చినా కూడా అడ్డుతొలగించుకునేందుకు పథకం రచిస్తున్నారు. ఇలాగే బరితెగించిన ఓ భార్య భర్త ముందే ప్రియుళ్లతో ఊహించని దారుణానికి పాల్పడింది. ఇటీవల రాజస్థాన్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అసలేం జరిగిందంటే? రాజస్థాన్ లోని నవోదా బేరా ప్రాంతానికి చెందిన ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరి కాపురం సజావుగా సాగుతున్న తరుణంలోనే రోడ్డు ప్రమాదంలో భర్త రెండు కాళ్లు కోల్పోయాడు. అప్పటి నుంచి భర్త కదలలేని స్థితిలో ఉంటూ మంచానికే పరిమితమయ్యాడు. అయితే ఈ క్రమంలోనే భార్య పరాయి సుఖం పాకులాడింది. దీంతో ఒకరిని కాదు, ఏకంగా ఇద్దరి వ్యక్తులతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ అడ్డు, అదుపు లేకుండా ప్రవర్తిస్తుంది. ఇంతటితో ఆగకుండా ప్రియుళ్లను ఒకరి తర్వాత ఒకరిని ఇంటికి రప్పించుకుని బెడ్ రూంలో సుఖాలు తీర్చుకుంటుంది.
ఈ విషయం భర్తకు తెలియడంతో అనేక సార్లు బుద్దిమార్చుకోవాలని మందలించాడు. భర్త మాటను అస్సలు లెక్కచేయని భార్య.. ప్రియుళ్లతో సరసాలకు కాలు దువ్వేది. అయితే ఇదే విషయాన్ని భర్త తన తండ్రికి చెప్పి మందలించే ప్రయత్నం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే తన తండ్రికి చెప్పడంతో మామ కోడలిని మందలించి కోపంతో కొట్టేంత పనిచేశారు. మామ ఉంటే నా సుఖాన్నితీర్చుకోలేనని భావించిన కోడలు.. అతడిని లేపేస్తే అడ్డు ఎవరు ఉండరని మామ హత్యకు ప్లాన్ గీసింది. దీంతో కోడలు ఇటీవల తన ఇద్దరి ప్రియుళ్లకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది.
ప్రియురాలి మాటను కాదనకుండా ఇద్దరు ప్రియుళ్లు ఎగేసుకుంటూ వచ్చారు. వస్తు వస్తూనే ప్రియురాలి భర్త ముందే అతని తండ్రిని దారుణంగా హత్య చేశారు. ఏం చేయలేని భర్త.. ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. అనంతరం స్థానికుల సాయంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యతో పాటు ఆమె ప్రియుళ్లను కూడా అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.