గత కొంత కాలంగా నగరంలో గన్ కల్చర్ పెరిగిపోతుంది. గన్ పేల్చాలన్న సరదా తో అక్రమంగా తుపాకులు కొనుగోలుచేసి ఇళ్లల్లో దాచుకుంటున్నారు. మరికొంత మంది గొప్ప కోసం తుపాకీని బయటికి తీసి కాల్పులు జరుపుతున్నారు. దాంతో, జనం ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. హైదరాబాద్ శివారులో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
రాచకొండ మీర్ఖంపేట గెస్ట్‌హౌస్‌లో పరిధిలో టీఆర్ఎస్ వీ నాయకులు విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రమ్ గన్‌తో కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడకు చెందిన ఓ ప్రజా ప్రతినిధికి సంబంధిచిన ఫాంహౌస్ ఉంది. గత నెల ఓ వేడుకులో విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధి వద్ద ఉన్న ఎయిర్ గన్ తో విఘ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలు గాల్లోకి కాల్పులు జరిపారు. వాటిని కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అది కాస్త వైరల్ గ మారింది.
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫాంహౌస్‌ను పరిశీలించి అక్కడ ఉన్న ఎయిర్‌గన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌజ్ లో జంతువులు రాకుండా వాటిని బెదిరించేందుకు తీసుకున్నట్లు ప్రజాప్రతినిధి తెలిపారు.ఇది మారణాయుధాల చట్ట పరిధిలోకి ఎయిర్ గన్ రాదని పోలీసులు తెలిపారు.