వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లై ఏడాది కావొస్తుంది. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ భార్యాభర్తలిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా చెన్నైలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్కేపేట మండలం సౌందర్ రాజన్(22) అనే యువకుడు, మాలైపాడు గ్రామానికి చెందిన పార్వతి(22) వీళ్లిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. దీంతో పెళ్లి కూడా చేసుకోవాలని భావించి గత 10 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆర్కేపేట పరిధిలోని ఓ గదిలో కాపురం పెట్టి స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. కొన్ని నెలల పాటు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. ఈ క్రమంలోనే పార్వతి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి కూడా. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి ఈ నవ దంపతులు షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు. ఆదివారం ఇద్దరూ రోజులాగే పనులకు వెళ్లారు. ఆకస్మాత్తుగా మధ్యాహ్నమే ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇక సాయంత్రం అయినా వారు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఏంటని అనుమానమొచ్చిన ఇంటిపక్కవారు తలుపులు తీసే ప్రయత్నం చేశారు. ఎంతకు ఓపెన్ కాలేదు. బద్దలు కొట్టి చూడగా ఆ భార్యాభర్తలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సిన్ చూసిన ఇరుగు పొరుగు వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. అసలు ఈ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? బలమైన కారణం ఏమైన దాగి ఉందా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ నవ జంట ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: తల్లిని చూడకూడని స్థితిలో చూసిన కొడుకు… తర్వాత జరిగింది ఇదే!