ఈమధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా తెల్లవారుజామున, అర్థరాత్రి ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని రోజలు క్రితం కర్ణాటకలో దైవదర్శనానికి వెళ్లి వెస్తుండగా ప్రమాదం చోటు చేసుకుని 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్‌లోని రెవా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న బస్సు, కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారంతా ఉత్తరప్రదేశ్‌కి చెందిన వారుగా తెలుస్తోంది. వీరంతా హైదరాబాద్‌లో ఉపాధి పనుల కోసం వచ్చారు. ఇక రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉండటంతో.. స్వస్థలానికి బయలుదేరారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. పండుగ పూట వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.