సమాజంలో రాను రాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. దానికి కారణం దేశంలో రోజూ జరుగుతున్న సంఘటనలే నిదర్శనం. మరో సారి రక్త సంబంధం మరణ శాసనం రాసిన సంఘటన మహారాష్ట్ర లోని పూణే నగరంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ వృద్ధురాలు సంపాదించిన ఆస్తే ఆమె ప్రాణం తీసింది. కన్న తల్లి అని కూడా చూడకుండా కొడుకు.. నానమ్మ అని చూడకుండా మనవడు అతి కిరాతకంగా ఓ వృద్ధురాలిని చంపారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఉషా విఠల్ గైక్వాడ్ (64) ఓ ఆర్మీ క్యాంప్ లో పని చేసి రిటైర్ట్ అయ్యారు. ఆమెకు ఓ కొడుకు సందీప్ గైక్వాడ్, కోడలు, మనవడు సాహిల్ గైక్వాడ్ లు ఉన్నారు. వీరందరు కేశవ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే తరచూ అత్త ఉషా కు, కోడలు కు రోజూ గొడవలు జరుగుతూ.. ఉండేవి. అందులో భాగంగానే ఆగష్టు 5 న మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోడలు అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై కొడుకు సందీప్, మనవడు సాహిల్ కోపం పెంచుకున్నారు. ఇక అదే రోజు మధ్యహ్ననం ఉషా విఠల్ నిద్రపోతుండగా మనవడు విచక్షణా రహితంగా కొట్టి బాత్రుంలోకి లాక్కెళ్లి గొంతు నులిమి చంపాడు.
ఈ క్రమంలోనే ఇంటికి వచ్చిన సందీప్ గైక్వాడ్ జరిగిన సంఘటనను చూశాడు. విషయం బయటికి తెలిస్తే పోలీసు కేసు అవుతుందని విచక్షణా రహితంగా తల్లి అని కూడా చూడకుండా.. ఆమె శరీరాన్ని చెట్లను నరికే కరెంట్ మిషన్ తో దారుణంగా 9 ముక్కలు చేశారు. వాటిని బ్యాగుల్లో కుక్కి.. కారులో తీసుకెళ్లి ముథా నదిలో పడేశారు. కానీ ఒక బ్యాగును మాత్రం చెత్త డిపో దగ్గర వదిలేశారు. హత్యకు వారు వాడిన వస్తువులను, బట్టలను నదీ ఒడ్డున పడేశారు. తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చి తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగష్టు 10 న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఉషా కూతురుకు తన అన్న సందీప్ మీద అనుమానం రావడంతో అతడినిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దాంతో అతడి కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఖాకీలు తమదైన రీతిలో ప్రశ్నించగా అసలు నిజాలు బయటపడ్డాయి. కొడుకు, మనవడే ఈ హత్యకు పాల్పడ్డట్లు అంగీకరించారు. దాంతో వారిని కస్టడిలోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు. ఇక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నానమ్మ ఆస్తి కోసమే ఇలా చేశానని, బాడీని ముక్కలు చేయాలి అన్న ఆలోచన ఓ మలయాళ డబ్బింగ్ మూవీ చూశాకే నాకు ఈ ఆలోచన వచ్చిందని సాహిల్ తెలిపాడు. మరి ఆస్తికోసం కొడుకు, మనవడే ఇంతటి ఘాతుకానికి పాల్పడటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.