దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. “ఆడవారికి ఆడవారే శత్రువులు” అన్న సామెతను నిజం చేస్తూ.. కొందరు మహిళలు ఆడజాతికే కళంకం తెస్తున్నారు. నిన్న గాక మెున్న చండీగఢ్ యూనివర్సిటీలో వెలుగు చూసిన విద్యార్థినుల స్నానాల వీడియోల.. ఘటన మరవక ముందే ఇలాంటి మరో ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. హాస్టల్లో ఉంటూనే తన తోటి మహిళల అశ్లీల వీడియోలను తీసి.. మరో వ్యక్తికి వాట్సాప్ ద్వారా పంపిన ఘటన మదురైలో వెలుగు చూసింది. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
మహిళలకు సొంతింట్లోనే రక్షణ లేకుండా పోతున్న కాలం ఇది. ఇక హాస్టల్లలో వారికి రక్షణ ఉంటుంది అనుకోవడం మన పొరపాటే. తాజాగా చండీగఢ్ యూనిర్సిటీ తరహాలో మరో ఘటన దేశంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిక్ అనే వ్యక్తి మదురైలో డాక్టర్. అతడికి రామనాథంపురం జిల్లా కముది ప్రాంతానికి చెందిన కాళేశ్వరి అనే మహిళతో పరిచయం ఏర్ఫడింది. సదరు మహిళ మదురైలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బీఈడీ చదువుకుంటోంది. ఆసిక్ కు కాళేశ్వరితో ఉన్న పరిచయంతో ఆమెను ఆ హాస్టల్లో ఉన్న మహిళల అశ్లీల వీడియోలను తీసుకురావాలని చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే ఆమె గత కొన్ని రోజులుగా ఆ హాస్టల్లలో ఉంటున్న యువతుల నగ్నవీడియోలను తీసి.. అతడికి వాట్సప్ ద్వారా పంపుతూ.. ఉండేది.
అయితే ఈ క్రమంలోనే రెండు రోజుల క్రీతం కాళేశ్వరి గదిలో ఉండే మరో యువతి కాళేశ్వరి ఫొన్ ను చూసింది. దాంట్లో ఉన్న వీడియోలను చూసి కంగుతిన్నది. వెంటనే ఈ విషయాన్ని సదరు యువతి హాస్టల్ వార్డెన్ కు చెప్పింది. దాంతో వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసిక్, కాళేశ్వరిని అరెస్ట్ చేసి.. ఇంకా వీరి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారిస్తున్నారు. వారి సెల్ ఫొన్లను పరిశీలిస్తున్నారు. మరి రోజురోజుకు మహిళలపై దారుణాలు ఒకవైపు పెరిగిపోతుంటే.. ఇలా కొందరు మహిళలు, యువతుల పాలిట రాక్షసులుగా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.