ఆడవాళ్ల మీద దాడులు, అఘాయిత్యాలు ఇప్పటికీ ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ఈ దాడుల్లో గాయపడటం, ఆస్పత్రుల పాలు కావడం చూశాం. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి సమయంలో ప్రతిఘటించడం చూస్తుంటాం. ఈ మహిళ ధైర్యంగా ఎదురు తిరగడమే కాదు.. అఘాయిత్యం చేయబోయిన వ్యక్తి ప్రైవేట్ పార్ట్ ని కోసేసింది.
దేశంలో ఏదో మూల ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, పోలీసులు హెచ్చరించినా, న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా కొందరు మాత్రం ఆడవాళ్లపై అకృత్యాలకు తెగబడుతున్నారు. వారి వికృత వాంఛలతో ఎంతో మంది జీవితాలను చీకటి చేస్తున్నారు. కొందరైతే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు చాలా మంది మహిళలు భయంతో బెంబేలెత్తిపోతారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ మాత్రం సమయస్ఫూర్తి ప్రదర్శించింది. ధైర్యం తెచ్చుకుని సదరు వ్యక్తిపై దాడికి దిగింది. ఏకంగా అతని ప్రైవేట్ పార్ట్ ని కోసేసింది.
ఈ ఘటన అస్సాం రాష్ట్రం మోరిగాన్ జిల్లా బొరాలిమరీ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉస్మాన్ అలీ ప్రార్థనలు చేస్తుంటాడు. ఓ మహిళకు చాలా కాలంగా పిల్లలు పుట్టుడం లేదు. పిల్లల కోసం ఉస్మాన్ అలీని ప్రార్థన చేయాల్సిందిగా కోరింది. ఉస్మాన్ తో తరచుగా ఆ మహిళ తన కష్టాలను చెప్పుకునేది. ఓరోజు తమ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా ఆ మహిళ ఉస్మాన్ అలీకి మెసేజ్ చేసింది. అతను ఆ మహిళ ఇంటికి చేరుకున్నాడు. అయితే కాసేపు ఏదో చేస్తున్నట్లుగా నటించాడు. తర్వాత ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నించాడు. ఆ మహిళపై రేప్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆ క్రమంలో మహిళ ప్రతిఘటించడం ప్రారంభించింది. ఎలాగైనా ఉస్మాన్ అలీ తన కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఉస్మాన్ నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ తీవ్రంగా పోరాడింది. అతడి నుంచి తప్పించుకుని పారిపోతుంటే.. ఉస్మాన్ కూడా ఆమె వెనకాలే పరుగులు తీశాడు. ఆ మహిళకు ఒక పదునైన వస్తువు దొరకగానే దాంతో.. ఉస్మాన్ అలీ ప్రైవేట్ పార్ట్ కోసేసింది. ఆత్మరక్షణలో భాగంగానే ఆ మహిళ ఆ పని చేసినట్లు తెలిపారు. ఉస్మాన్ నొప్పితో విలవిల్లాడాడు. నేలపై పడి కొట్టుకున్నాడు. తనని రక్షించాలని వేడుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఉస్మాన్ అలీని మెరుగైన చికిత్స కోసం గువహటి ఆస్పత్రికి తరలించారు. స్ట్రేక్చర్ పై పడుకుని నొప్పితో గిలగిల కొట్టుకుంటున్న ఉస్మాన్ అలీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రేప్ చేయబోయిన ఉస్మాన్ కు సరైన శిక్ష పడిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Osman Ali’s Penis slashed, while trying to rape a female……😳😳😳
Admitted in Guwahati Medical College for treatment.
অসমীয়াত কয়
যেনে কুকুৰ
তেনে টাঙোন
cc@paganhindu @ShefVaidya pic.twitter.com/d8tsk406M1— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) May 8, 2023