వారం రోజుల క్రితమే ఆ ఇంట్లో వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ ఇంట్లో ఒకేసారి ఐదుగురు మృతి చెందారు. ఈ వార్త రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఆ వివరాలు..
వారం రోజుల క్రితమే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఎంతో సంతోషంగా వారిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి హడావుడి ఇంకా ముగియలేదు. ఈ లోపే దారుణం చోటు చేసుకుంది. పెళ్లి పందిరితో పచ్చగా కలకలాడుతున్న ఆ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన వారం రోజులకే ఆ ఇంట్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. నూతన దంపతులు, వారి ముగ్గురు పిల్లలు మొత్తం ఐదుగురు శవాలై కనిపించారు. ఈ వార్తతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కి పడింది. అసలు ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. పెళ్లింట ఇంతటి విషాదం ఏంటి.. అసలేం జరిగిందో అర్థం కాక అందరు తలలు పట్టుకున్నారు. పోలీసులు హత్య, ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ దారుణం కేరళ, కన్నూర్, చెరుపుజలో చోటు చేసుకుంది. శ్రీజ-షాజీ అనే దంపతులకు వారం రోజుల క్రితమే వివాహం జరిగింది. అయితే వీరిద్దరికి ఇది రెండో వివాహం. శ్రీజ మొదటి భర్త నుంచి విడిపోయి.. ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ముగ్గురు సంతానం. షాజీకి కూడా గతంలో వివాహం అయ్యింది. అతడికి మొదటి భార్య ద్వారా ఇద్దరు సంతానం జన్మించారు. అయితే వీరిద్దరికి మొదటి వివాహం చేదు జ్ఞాపకాలనే మిగల్చడంతో.. విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఇద్దరికి ఒకే కథ, వ్యధ అని తెలుసుకున్నారు. దాంతో తామిద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో వారం రోజుల క్రితం అనగా మే 16న శ్రీజ-షాజీ ఇద్దరు రెండో వివాహం చేసుకున్నారు. శ్రీజ, షాజీ, ఆమె ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు. కానీ పెళ్లైన వారం రోజులకే శ్రీజ, షాజీ, ఆమె ముగ్గురు పిల్లలతో పాటు ఆ జంట కూడా శవాలై కనిపించారు. పిల్లలు ముగ్గురు మెట్లకు, శ్రీజ-షాజీ దంపతులు ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ముందుగా పిల్లలను చంపేసి.. ఆ తర్వాత వారిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. చిన్నారులను సూరజ్(12), సుజిన్(10), సురభి(8)లుగా గుర్తించారు. పెళ్లైన వారం రోజులకే.. ఒకే కుటుంబానికి చెందని ఐదుగురు మృత్యువాత పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.
ఈ ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారం క్రితమే వివాహం చేసుకున్న దంపతులు ఇంతటి దారుణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దాని గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరికి మొదటి పెళ్లి ఎలాను కలిసి రాలేదు.. రెండో వివాహం తర్వాత అయినా.. పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తారు అనుకుంటే.. ఇలా జరిగింది ఏంటి అంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు బంధు మిత్రలు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.