ప్రేమ పేరుతో మోసపోతున్న యువతి, యువకుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతుంది. అచ్చం ఇలాగే ప్రియుడి చేతిలో నిండా మోసపోయిన ఓ యువతి లవ్ స్టోరీలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది కర్ణాటకలోని ముళబాగిలు పరిధిలోని కురుబరహళ్లి. ఇదే ప్రాంతంలో వెన్నెల (21) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే వీరి పక్క గ్రామమైన జంగాలపల్లిలో చంద్రశేఖర్ అనే యువకుడు ఉంటున్నాడు. అయితే గతంలో వెన్నెలకు చంద్రశేఖర్ పరిచయమయ్యాడు. ఒకరికొకరు తెలియడంతో కొన్ని రోజుల తర్వాత ఇంకాస్త దగ్గరయ్యారు.
ఇదే పరిచయం చివరికి వీరిద్దరూ ప్రేమించుకునేదాక వెళ్లింది. అలా కొన్నాళ్ల పాటు వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇక వెన్నెల ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వెన్నెలను మందలించారు. ఇక ప్రియుడిని విడిచి ఉండలేని ఆ యువతి అతనితో పాటే ఉండాలనుకుంది. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం వెన్నెల, చంద్రశేఖర్ ఇద్దరు కలిసి ఊరు వదిలి కొన్నాళ్లు బయట తిరిగారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు వారిని కనిపెట్టి చివరికి ఇంటికి తీసుకొచ్చారు. అలా కొన్ని రోజులు గడిచింది.
వెన్నెల మాత్రం ప్రియుడు చంద్రశేఖర్ ను విడిచి ఉండలేకపోతుంది. ఎలాగైన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. ప్రియుడు కూడా వెన్నెలకు పెళ్లి చేసుకుంటానని గతంలో అనేక సార్లు మాటిచ్చాడు. అయితే ఈ క్రమంలోనే వెన్నెల ఇటీవల ప్రియుడిని కలిసి పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ ప్రియురాలి మాటను కాదన్న చంద్రశేఖర్.., నేను నిన్ను పెళ్లి చేసుకోనంటూ షాకింగ్ వార్త ప్రియురాలికి చెప్పాడు. ప్రియుడి మాటలు విన్న వెన్నెల ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇక మోసపోయానని గ్రహించిన ఆ యువతి తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఇక ఈ సమయంలో వెన్నెలకు ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. చేసేదేంలేక ఇటీవల ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం చివరికి ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.